దేశాల‌న్నిటిలోక‌ల్లా చైనా దేశం చాలా చిన్న‌దిగా చెబుతుంటారు. అలాగే అక్క‌డి జ‌నాభా సంఖ్య కూడా ఎక్కువంటుంటారు. గ‌త సంవ‌త్స‌రం 2019లో అక్క‌డి జ‌నాభా సంఖ్య 140.05కోట్లు ఉండ‌గా... ఆ దేశ గ‌ణాంకాల ప్ర‌కారం ఈ విష‌యాన్ని శుక్ర‌వారం నాడు ప్ర‌క‌టించారు. అక్క‌డ క‌మ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక నాటి నుంచి ఆ దేశంలో ఎన్న‌డూ లేనంత విధంగా శిశు జ‌న‌నాలు నెమ్మ‌దిగా త‌గ్గుతూ వ‌చ్చాయి. చైనాలో గత మూడేళ్లుగా శిశు జననాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోండ‌గా. దీని వల్ల చైనాలో స్త్రీ, పురుషుల సంఖ్య మధ్య వ్యత్యాసం కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అక్కడ స్త్రీలకన్నా పురుషులు మూడు కోట్ల మంది ఎక్కువగా ఉన్నార‌ని స‌మాచారం.

 

ఆ దేశంలో చైనా ప్ర‌భుత్వం స్త్రీ, పురుషుల మ‌ధ్య ఉండే వ్య‌త్యాసం ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌డంతో దాని వ‌ల్ల వ‌చ్చే ప‌రిణామాలు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆ విష‌యాన్ని గ్ర‌హించారు. దాంతో స్త్రీల సంతానాన్ని అధికంగా ప్రోత్స‌హించ‌డం కోసం  ఏకంగా ఒకేసారి 40 ఏళ్ళ‌పాటు అమ‌లు చేసిన ఏక సంతాన విధానాన్ని కూడా ఎత్తివేసింది. అయినా కూడా స్ట్రీ పురుషుల మ‌ధ్య వ్య‌త్యాసం ఏమాత్రం త‌గ్గ‌లేదు.  దాంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఈ విష‌యం పై ఆందోళ‌న చెందుతుంది. మూడు కోట్ల వ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్య‌ ఏకంగా వ్య‌త్యాసం చూపుతోంది. శిశు జననాల సంఖ్య ప్రతి వెయ్యికి 10.48కి పడిపోయింది. 

 

అక్కడి మొత్తం జనాభాలో 18.1 శాతం మంది 60 ఏళ్లు దాటిన వారు ఉండడంతో పనిచేసే జనాభా సంఖ్య కూడా తగ్గిపోయింది. చైనా నిబంధనల ప్రకారం 16 నుంచి 59 ఏళ్ల వరకే పని చేయడానికి అవకాశం. 59 ఏళ్లు నిండగానే పదవీ విరమణ చేయాల్సిందే. 60 ఏళ్లు దాటిన సంఖ్య పెరగడంతో పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.  దాంతో జ‌నాభా సంఖ్య పురుగుతూ ప‌ని చేసే వారి సంఖ్య త‌గ్గ‌డంతో ఆర్ధికంగా కూడా కాస్త ఇబ్బంది ఏర్ప‌డుతుంది. ఇక భారత్‌ జనాభా 130 కోట్లకు చేరుకుందన్న విషయం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: