టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లలో వందల ఎకరాలు కొన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కౌంటర్ గా అన్నట్టు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఒకటి జగన్ ఇల్లు గురించి. జగన్ ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకు తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.

 

అయితే ఇప్పడు ఇదే టీడీపీ నేతల ఆరోపణలకు కారణమవుతోంది. తాజాగా సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతుందన్నారు. తమకు బెయిల్ కార్డులు, జైలు కార్డులు, బినామీ కార్డులు లేవని.. ఉన్న ఆస్తులన్నీ తమ పేరు మీదే ఉన్నాయని పరోక్షంగా జగన్ పై విరుచుకుపడ్డారు.

 

బినామీ బతుకులు బతికేది తాము కాదని.. జగనేనని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. ఆయనపై సాక్షి పత్రిక కథనం రాసింది. ఆయన బినామీ ఆస్తులు కూడా బెట్టారని ఆయన కూతురుకు వైట్ రేషన్ కార్డు ఉందని రాసిందని ఆయన అంటున్నారు. ఆయన ఆరోపణలకు సమాధానం ఇస్తూ.. జగన్ ఉంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. జగన్ నివాసం ఓ కంపెనీ పేరు మీద ఉందని ధూళిపాళ్ల ఆరోపిస్తున్నారు. ఇలా కంపెనీల పేరు మీద ఇళ్లు ఉండటం నేరం కాదు.. అసాధారణం అంత కన్నా కాదు. హెరిటేజ్ కంపెనీ పేరు మీద కూడా చాలా ఇళ్లు ఉంటాయి. అవన్నీ బినామీ అయిపోవు. ఈ విషయం ధూళిపాళ్లకు కూడా తెలుసే ఉండొచ్చు. కానీ జనం అంత దూరం ఆలోచిస్తారా అన్న ఆలోచనలో ఇలాంటి ఆరోపణలు చేసి ఉండొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: