తమకు 151సీట్లున్నాయని విర్రవీగుతున్న వైసీపీసభ్యులంతా సిగ్గుతో తలదించు కోవాలని, 10వేలమంది పోలీసుల్ని మోహరించి అసెంబ్లీ నిర్వహించాలని చూస్తున్న ప్రభుత్వం, తానుచేసిన తప్పుకి భయపడుతోందని, అందుకే పోలీసుల మోహరింపులో మావోయిస్టురాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌ను మించిపోయిందని టీడీపీ సీనియర్‌నేత, మాజీమం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.  రైతులు, మహిళలు కన్నీళ్లు పెడుతుంటే, కర్కోటకుడైన ముఖ్యమంత్రి మానవత్వం, కనికరంలేకుండా ప్రవర్తిస్తున్నా డని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. 

 

రాజధాని మహిళలంతా 13కిలోమీటర్లు నడిచి వెళ్లి, కనకదుర్గమ్మకు చీర-సారె సమర్పించారని, అమ్మదయ అమరావతికి ఉంటుందని ఆశిస్తున్నామని దేవినేని చెప్పారు. ప్రజల రెఫరెండంకోరుతూ, విశాఖలోని పబ్లిక్‌ లైబ్రరీలో రాజధాని నిర్ణయంపై జేఏసీ తలపెట్టిన ప్రజాబ్యాలెట్‌ను అడ్డుకొని  షార్ట్‌సర్క్యూ ట్‌పేరుతో భయపెట్టి, పోలీసుల్ని అడ్డుపెట్టడం దుర్మార్గమన్నారు. విశాఖలోని బీచ్‌రోడ్డు లో మూడుకిలోమీటర్లవరకు పోలీసుల్ని మోహరించి ఎందుకు బ్లాక్‌చేశారో చెప్పాలన్నా రు. ఓట్లేయని విశాఖవాసుల్ని, ఓటేసిన కృష్ణా, గుంటూరుజిల్లాల వాసుల్ని ఏడిపిస్తున్న ప్రభుత్వం, వైజాగ్‌లో భూదందాను యథేచ్ఛగా కొనసాగిస్తోందన్నారు.

 

 విజయసాయి రెడ్డి, జాయింట్‌కలెక్టర్‌, డీసీపీల ఆధ్వర్యంలో గయాలిభూములు కాజేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. జాయింట్‌కలెక్టర్‌ ప్రతిశనివారం కోర్టు నిర్వహిస్తూ, సెటిల్‌మెంట్ల పేరుతో భూములు కాజేస్తున్నారని ఉమా దుయ్యబట్టారు. అమరావతి ప్రాంతంలో రైతుల్ని మభ్యపెట్టి భూములుకాజేయాలని చూసిన వైసీపీనేతల్ని ప్రజలు తిరస్కరించారని, ఇక్కడ వారి ఆటలుసాగకపోవడంతో, విశాఖకేంద్రంగా భూదోపిడీకి తెరలేపారన్నారు.  రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో కొట్టేసిన భూములధరలు పెంచుకోవడానికే కేసీఆర్‌తో జగన్‌ చర్చలు జరిపాడని ఉమా ఆరోపించారు. 

 

అమరావతిని చంపేస్తానని, దాంతో హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ ఊపందుకుంటుందనే ఒప్పందంతోనే, జగన్‌ తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాడన్నారు. మూర్ఖత్వంతో, మొండితనంతో వ్యవహరిస్తున్న పులివెందులపులి డమ్మీకాన్వాయ్‌లో అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధమైందని ఉమా ఎద్దేవాచేశారు. దేశచరిత్రలో డమ్మీకాన్వాయ్‌ని ముందుపంపి, ట్రయల్‌రన్‌ నిర్వహించి, దొడ్డిదారిలో రాత్రికిరాత్రి రోడ్లేసి అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధమైన ముఖ్యమంత్రిగా జగన్‌ నిలిచి పోతాడన్నారు. ఇదివరకు సచివాలయానికి వెళ్లినప్పుడు పోలీసులసాయంతో ముళ్లకంచెలు, వలలు అడ్డుపెట్టుకున్న ముఖ్యమంత్రి, బడాయి కబుర్లు చెబుతున్నాడన్నారు. దమ్ము, ధైర్యంలేని 151మంది వైసీపీఎమ్మెల్యేలు జగన్‌ ముందు వెన్నెముకలేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: