ఇన్‌సైడ్ ట్రేడింగ్....ఎప్పుడైతే రాజధానిగా అమరావతి పేరు తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి మారుమ్రోగుతున్న పదం. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ ఆరోపణలు ఆపలేదు. అయితే గుడ్డిగా ఆరోపణలు చేయడమే కాకుండా, ఇన్ సైడ్ ట్రేడింగ్‌పై దర్యాప్తు కూడా చేసి, కొన్ని లెక్కలు చెప్పారు. ఆ లెక్కల ప్రకారం టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల వ్యాపారవేత్తలు అమరావతిలో 4 వేలకు పైనే ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పింది.

 

అయితే వైసీపీ ప్రభుత్వం లెక్కలు చెప్పిన చెప్పకపోయిన అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగందనేది వాస్తవం. అలా ఇన్ సైడ్ ట్రెండింగ్‌కు పాల్పడిన వారే ఇప్పుడు అమరావతిలోనే రాజధాని ఉంచాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వచ్చారు. అధినేత చంద్రబాబుతో కలిసి పోరాటాలు చేస్తున్నారు. అయితే ఓ వైపు పోరాటాలు చేస్తూనే మరోవైపు బాబు వల్లే తాము నష్టపోతున్నామని తెలుగు తమ్ముళ్ళు లోలోపల తిట్టుకుంటున్నారట.

 

ఇలా లోలోపల తిట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు  చాలామంది తమ్ముళ్ళు తమదగ్గర ఉన్న సొమ్ముతో పాటు అప్పులు చేసి మరీ భూములు కొనేశారు. అప్పటిలో హైదరాబాద్ ప్రాంతంలో ఏ విధంగా లబ్ది చేకూరిందో, ఇప్పుడు అమరావతిలో కూడా అదే విధంగా లాభం జరుగుతుందని భావించారు. కానీ ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిలో మంచి గ్రాఫిక్స్ చేసి వదిలిపెట్టారు. దీంతో అక్కడ అనుకున్న మేర అభివృద్ధి జరగాలి.

 

ఒకవేళ అప్పుడు అభివృద్ధి జరిగి ఉంటే, ఇప్పుడు రాజధాని మార్చే అవకాశం వచ్చేది కాదని తెలుగు తమ్ముళ్ళు తెగ బాధపడిపోతున్నారట. చంద్రబాబు అభివృద్ధి చేసి తమ ఆస్తుల విలువులు పెంచుతారని భావించి, పెట్టుబడి పెట్టామని కానీ అమరావతిలో సీన్ రివర్స్ అవుతుందనుకోలేదని టీడీపీ నేతలు తమ అనుయాయిల దగ్గర వాపోతున్నట్లు తెలిసింది. మొత్తానికి అమరావతి దెబ్బ తెలుగు తమ్ముళ్ళు మీద గట్టిగానే పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: