మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలి. ఇది ప్రతిపక్ష టీడీపీ డిమాండ్. అందుకోసం వైసీపీ ప్రభుత్వంపై పోరాటం కూడా చేస్తుంది. అధినేత చంద్రబాబు రోడ్లపైకి వచ్చి జోలె పట్టుకుని మరి ప్రజలని వేడుకుంటున్నారు. అయితే ప్రజలు మాత్రం మూడు రాజధానుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అలాగే టీడీపీలో ఉన్న కొందరు నేతలు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నేతలు దీనిపై గట్టిగా నిలబడి ఉన్నారు.

 

సరే విశాఖలో రాజధాని వస్తుంది కాబట్టి, బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. బాబు ఉద్యమానికి మద్ధతు ఇవ్వట్లేదు. కానీ రాజధాని పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలోని కొందరు టీడీపీ నేతలు బాబుకు గట్టిగా హ్యాండ్ ఇస్తున్నారు. అమరావతి కోసం ఉద్యమం మొదలై నెల రోజులు దాటిన కొందరు నేతలు బయట ఎక్కువ కనిపించలేదు. ఏదో విజయవాడ పరిధిలో ఉన్న కొందరు నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు గానీ...రాజధానిగా దూరంగా ఉన్న నియోజకవర్గ నేతలు పెద్దగా అడ్రెస్ లేరు.

 

ముఖ్యంగా అవనిగడ్డ, పెడన, పామర్రు, నూజివీడు నియోజకవర్గాల్లో నేతలు పెద్దగా ఆందోళనల్లో పాల్గొన్నట్లు కనిపించలేదు. ఇక గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకుడు లేకపోవడం వల్ల అక్కడ చోటా మోటా నాయకులు హడావిడి చేస్తున్నారు. అయితే మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఏదొకవిధంగా ఆందోళనలు చేస్తూ కనిపిస్తున్నారు.

 

అటు విజయవాడ పరిధిలో బొండా ఉమా, దేవినేని ఉమా, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, బచ్చుల అర్జునుడు లాంటి వారు బాబుతో పాటు పోరాటం చేస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ ఎందుకోసం పోరాటం చేస్తున్నారో ప్రజలు బాగానే గమనించారు. మొత్తానికి బాబు చేసే పోరాటానికి అమరావతికి దగ్గరలో ఉన్న నేతల మద్ధతే దక్కడం లేదు. ఇంకా ప్రజల మద్ధతు ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: