ఆంధ్రప్రదేశ్ లో 2014 లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం మొత్తం అయిదేళ్ళు జగన్ చుట్టూనే తిరిగింది. అవును ఎవరు అవునన్నా కాదన్నా సరే విపక్షం అధికార పక్షాన్ని ఆడించింది. ఏ ప్రచారం చేసినా, ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా దానిపై వివరణలు ఇచ్చుకుంటూ వచ్చారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనపడటానికి ప్రధాన కారణం అదే. వాళ్ళ నుంచి ఎన్ని ప్రచారాలు వచ్చినా సరే వాటికి వివరణ ఇవ్వడ౦తోనే కాలం మొత్తం సరిపోయింది.

 

అయిదేళ్ళ ప్రభుత్వ వ్యవధిలో 80 శాతం దానికే వెచ్చించారు. ఇప్పుడు విపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. రాజకీయంగా బలపడాల్సిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అదే విధంగా జగన్ ఆడించినట్టు ఆడుతుంది. ఇప్పుడు రాజధాని విషయంలో వాస్తవాలను బయటపెట్టలేకపోతుంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది తెలుగుదేశం పార్టీ అనడంలో ఏ సందేహం లేదు. 

 

ప్ర‌భుత్వంలో లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఎంచుకుని పోరాటం చేసే విష‌యంలో టీడీపీ విఫ‌ల మ‌వుతోంది. నిర్ణాణాత్మ‌కంగా చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వంపై పోరాటం చేయడంలో తెలుగుదేశం విఫలమవుతు౦ది. గ్రామాల్లో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కరెంట్ కోతలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయినా సరే ప్రభుత్వంపై విషయం మీద మాట్లాడటం లేదు తెలుగుదేశం పార్టీ.

 

అందుకే జగన్ ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది తెలుగుదేశ౦. ఎంత అనుభవం ఉన్నా ఎన్ని దెబ్బలు తగిలినా సరే నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. జగన్ వెంట పడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడంతో సమయం మొత్తం వృధా చేస్తుంది. రాజధాని అనే అంశాన్ని పట్టుకుని వేలాడుతుంది. దీంతో జ‌గ‌న్ చుట్టూ టోట‌ల్ ఏపీ కేడ‌ర్ తిరుగుతోందే త‌ప్పా ప్ర‌జ‌ల్లో ప‌ట్టు తెచ్చుకునే పోరాటాలు మాత్రం వాళ్లు చేయ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: