మున్పిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సాయంత్రం 5 గంటలతో మైకుల కూతలు ఆగనున్నాయి. దీంతో ఆఖరి క్షణాల్లో మరింత స్పీడు పెంచాయి రాజకీయ పార్టీలు. ఇక పరస్పర విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 

తెలంగాణలో మున్పిపల్ ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్... కాంగ్రెస్ ఎప్పటి మాదిరిగానే పోటీ పడుతున్నా... ఈ సారి బీజేపీ కూడా మేమేంటో చూపిస్తామంటోంది. మున్పిపాలిటీల్లో తన పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఎవరికివారు.. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి మరికొన్నిగంటల్లో గడువు ముగుస్తుండతో  ముఖ్యనాయకులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అధికార పార్టీ మంత్రులు అంతా నియోజవర్గాల్లోని మున్నిపాలిటీలకు పరిమితం అయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజవర్గంలో... కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ శివారు మున్పిపాలిటీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుతున్నారు.

 

మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు  ప్రచారంలో పాల్గొన్నారు. . కాంగ్రెస్, బీజేపీలు దారం తెగిన గాలిపటాలన్న ఆయన...  57 ఏళ్లు  నిండిన వారందరికి త్వరలోనే.. పెన్షన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదు..అలాంటి పార్టీకి ఓట్లేసి ప్రయోజనం లేదని విమర్శించారు. 

 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరవాత...మున్సిపాలిటీలకు ఒరిగిందేమీ లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. నల్గొండ మున్పిపాలిటీలో..ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించాలని పిలుపునిచ్చారు. మున్పిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫెయిలయ్యారని ఆరోపించారు. 

 

మరోవైపు రాష్ట్రానికి కేంద్రం నిధులేమీ ఇవ్వలేదన్న ఆరోపణల్ని ఖండించారు కిషన్‌రెడ్డి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో తెలంగాణ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీతమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టాయి. ప్రతీ మున్సిపాలిటీలో ఎగిరేది తన పార్టీ జెండానే అని చెప్పుకుంటున్నా... ఈ నెల 22న జనం ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: