ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ  ఆప్ పార్టీ .. గ్యారెంటీ కార్డును విడుదల చేసింది. రాజధానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్, స్వచ్చమైన నీరు అందిస్తామంటూ సీఎం కేజ్రీవాల్ కీలక హామీలను ఈ గ్యారెంటీ కార్డులో పెట్టారు. 

 

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో..ఢిల్లీలో రాజకీయ వాతావరణం వాడివేడిగా సాగుతోంది. పార్టీలు జనాల్ని ఆకర్షించేందుకు.. తమ మ్యానిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆప్.. గ్యారెంటీ కార్డు విడుదల చేసింది. కీలక హామీలతో గ్యారెంటీ కార్డును.. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల చేశారు.

 

రాజధాని నగరానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్, స్వచ్ఛమైన నీరు అందిస్తామని  గ్యారెంటీ కార్డులో పొందుపరిచారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామనే దృఢ సంకల్పాన్ని... ఈ గ్యారంటీ కార్డ్ ద్వారా  పునరుద్ఘాటించినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. మహిళా భద్రత, నీటి సరఫరా, యుమునా నది ప్రక్షాళన, రవాణారంగాన్ని మెరుగుపరచడం వంటి పలు అంశాలపై ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు.

 

'జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో మేనిఫెస్టోను  ప్రజల ముందుంచుతామని ఆప్ వర్గాలు తెలిపాయి.. ఇది రెండంచెల విధానంలో ఉంటుందన్నాయి.. తొలుత గ్యారెంటీ కార్డును తెచ్చి, ఆ తర్వాత సమగ్ర మేనిఫెస్టో తెస్తున్నామని' ఆప్ నేత గోపాయ్ రాయ్ తెలిపారు.  ఐదేళ్లుగా  పాఠశాలల పీజులను అదుపులో ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు., ఆ విధానం మున్ముందు కూడా కొనసాగిస్తామన్నారు.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ ట్వీట్‌ కూడా చేశారు. నిజాయితీ కలిగిన ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకూ ఢిల్లీలోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తానికి ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ఆప్ గట్టి ఉపాయమే పన్నింది. అందుకే గ్యారెంటీ కార్డును రిలీజ్ చేసి ఓటర్ల నాడి పట్టేందుకు సిద్ధమైపోయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు కూడా తమదైన శైలిలో ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: