కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం సంచ‌ల‌నంగానే కాకుండా చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకునే విషయంపై చర్చించారు.  అనంతరం ఇరు పార్టీలు సమావేశమయ్యి ఎన్నికల్లో పొత్తుల గురించి, అమరావతి రైతుల సమస్యలపై పోరాటం చేసే విషయం గురించి చర్చించిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పొత్తుల ఒప్పందం కుదిరిన వెంటనే పవన్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 8+8 ఎన్.ఎస్.జీ కమాండో భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.  

 

నిబంధ‌నల ప్ర‌కారం పార్టీ అధ్యక్షుడిగా స‌హ‌జంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కొంత భద్రత ఉంటుంది. అయితే, తాజాగా ప‌వ‌న్ విష‌యంలో కేంద్ర హోంశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అదికూడా స‌రిగ్గా పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన త‌ర్వాతే. కేంద్ర భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన ఎన్ఎస్‌జీ క‌మాండో భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

కాగా, ఇప్ప‌టికే ప‌వ‌న్‌-బీజేపీ పొత్తు విష‌యంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమెరికాలో ఉన్న ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ సైతం ఈ పొత్తుపై స్పందించారు. బీజేపీ-జనసేన పొత్తు విషయంగా స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవన్ పవర్ కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. పవన్ కి ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని తాను ముందే చెప్పానని ఆయన పోటీ చేసే సొంత సీటును కూడా గెలవరని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. పవన్ ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్నారని మాయవతి ప్రధాని ఆయన ముఖ్యమంత్రి అవుదామని భావించారని కానీ మోదీ అధికారంలోకి ఉన్నారని నడ్డా, అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని విరుచుకుపడ్డారు. రైతులకు న్యాయం జరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాలి కానీ ఎందుకు హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీకి చెప్పి ప్రత్యేక హోదా తీసుకొస్తే అప్పుడు ప్రజలు పవన్ ను నమ్ముతారని అన్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు చంద్రబాబుతో ఉండి.. ఆయన పలుకులు పలికి.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటని ప్రశ్నించారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ భ‌ద్ర‌త విష‌యమై 

 

మరింత సమాచారం తెలుసుకోండి: