మున్సిపోల్స్ నేపధ్యం లో అధికార టీఆరెస్ లో  టికెట్ల విక్రయానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆశావాహుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న అనుమానాలు రోజుకింత బలపడుతున్నాయి .  టికెట్ల కేటాయింపుల కోసం మంత్రి  డబ్బులు డిమాండ్ చేసిన ఆడియోలు , వీడియోలు తన వద్ద ఉన్నాయని  టీఆరెస్ పార్టీ సీనియర్ నేత రాపోలు రాములు బాంబు పేల్చగా , ఇప్పుడు మల్లారెడ్డి కొడుకు , అల్లుడితో మరొక నేత ఫోన్ సంభాషణలు సోషల్ మీడియా లో హల్ , చల్ చేస్తున్నాయి .

 

దీనితో అధికార పార్టీ టికెట్లను అమ్ముకుని , అర్హులకు అన్యాయం చేసిందని పలువురు మండిపడుతున్నారు . మల్లారెడ్డి కుమారుడు , అల్లుడితో బోడుప్పల్ కు చెందిన టీఆరెస్ నాయకుడు బొమ్మక్ మురళి  జరిపిన ఫోన్  సంభాషణ ఆడియో లు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి . బోడుప్పల్ కార్పొరేషన్ లో  బొమ్మక్ మురళి అనే నాయకుడు టీఆరెస్ టికెట్ ఆశించారు . అయితే టికెట్ దక్కించుకోవడానికి అడిగిన మొత్తాన్ని ఇస్తానని చెప్పిన ఆయన తొలుత , మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కి ఫోన్ చేసి డబ్బు రెడీగా ఉందని ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలని ప్రశ్నించారు .

 

అయితే ఆ విషయాలన్నీ భద్ర  చూసుకుంటున్నారని ఆయనకే ఫోన్ చేయాలని సూచించారు .  దాంతో బొమ్మక్ మురళి , భద్రారెడ్డి కి ఫోన్ చేశాడు . డబ్బు రెడీగా ఉందని , ఇక్కడే ఉందని చెప్పగా ... అధిష్టానం మరొకరికి అవకాశం ఇచ్చిందని భద్రారెడ్డి సమాధానం చెప్పగా , మంత్రి తనకే అవకాశం ఇస్తానని చెప్పారని  మురళి నిరాశగా ఫోన్ పెట్టేశాడు . అనంతరం మేయర్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు . 

మరింత సమాచారం తెలుసుకోండి: