ఈ దేశంలో కామాంధులు ఎక్కువ అయిపోయారు.. మొన్నటికి మొన్న ఢిల్లీలో నిర్భయ.. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో దిశ.. ఈరోజు కర్ణాటకలోని మరొకరు.. ఇలా రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఏడాది కనిపిస్తే చాలు అత్యాచారాలు చేస్తున్నారు ఈ కామాంధులు.. నీచులు. 

 

అయితే అందరి కామాంధుల విషయంలో న్యాయం జరగకపోయినా.. కొందరి విషయాలలో ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుంది. అందుకే నిర్భయ కేసు జరిగి ఎనిమిదేళ్లు అయినా ఇప్పుడు ఈ వచ్చే నెల న్యాయం జరగనుంది. ఇంకా మొన్న దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపి న్యాయం చేశారు. 

 

ఇప్పుడు కర్ణాటకలోని మరో యువతీకి న్యాయం జరిగింది. ఆ ముగ్గురు కామాంధులకు ఉరిశిక్ష పడింది. భైరండహళ్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ళ వెంకటేశప్ప అనే వృద్ధుడు 2018, మే 1వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటన బైరందహళ్లి గ్రామంలోని వేమగల్‌ పోలీస్‌‌స్టేషన్లో కేసు నమోదైంది. 

 

అయితే నేరం నిరూపణ కావడంతో జడ్జి ఆ కామాంధుడికి ఉరిశిక్ష విధించారు. అలాగే మరో 2016, ఫిబ్రవరి 16న శృంగేరి తాలూకా మెణసె గ్రామానికి చెందిన యువతి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుంగా ఆదే గ్రామానికి చెందిన సంతోష్, ప్రదీప్‌ ఆమెను ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను ఘోరంగా చంపి బావిలో పడేసి పరారయ్యారు.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్, ప్రదీప్‌ను అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టగా పక్కా ఆధారాలు కోర్టులో సమర్పించడంతో చిక్కమంగళూరు స్పెషల్ కోర్టు జడ్జి వారిద్దరిని దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో మొత్తంగా కర్ణాటకలో ముగ్గురికి ఉరి శిక్ష పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: