రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చెప్పాలంటే.. రాజకీయాల్లో శాస్వత శత్రువులు కానీ శాస్వత మిత్రులు కానీ ఉండరనేది ఓ నానుడి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే. సంచలనంగా మారిన ఈ రెండు పార్టీల పొత్తుపై రాజకీయ వర్గాల్లో ఎటువంటి వ్యతిరేకత, విమర్శలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై సీనియర్ హీరో, బీజేపీ నేత రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికరంగా స్పందించారు.

 

 

బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ నిర్ణయం చాలా మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కృష్ణం రాజు. ఈ విలీనం జనసేనకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పవన్ మేల్కొని పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. పేద ప్రజల అభ్యున్నతి ఈ పొత్తు ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రానికి వీరిద్దరి కలయికతో మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. జనసేనబీజేపీ కలిసి ప్రజలకు న్యాయం చేస్తారని అభిప్రాయపడ్డారు. నిజానికి.. ఈ నిర్ణయంతో పవన్ పై పెద్దగా వ్యతిరేకత రాలేదు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు మంచి జరుగడం లేదని ఇప్పటికే ఈ రెండు పార్టీలు గళమెత్తుతున్నాయి.

 

 

కృష్ణంరాజు మొదటి నుంచీ బీజేపీ వ్యక్తి. కొన్ని పరిణామాల మధ్య 2009లో చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. అక్కడి నుంచి మళ్లీ బీజేపీలోనే చేరారు. ఇప్పుడు యాక్టివ్ గా బీజేపీలోనే కొనసాగుతున్నారు.. కృష్ణంరాజు. అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు మాత్రం కేంద్రం అనుమతి తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. మరి ఈ అసెంబ్లీ అంశాల్లో రాజధానిపై పాలకపక్షం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: