కొన్ని కొన్ని సార్లు మనం జంతువులలో చూసే ప్రేమ... జాలి.. ఆప్యాయత మనుషులలో కూడా చూడలేం.. అంత మంచి జంతువులు ఉంటాయి. మంచి పెట్స్ ఉంటాయి. మనుషులే వారికీ వారు సహాయం చేసుకొని వారు ఉన్న కాలంలో జంతువులు వాటికీ అవే సాయం చేసుకుంటే ఎంత అద్భుతం అసలు.. చూడటానికి ఎంత బాగుటుంది.. 

 

ఈ నేపథ్యంలోనే ఓ బాతు తన జాలి గుండెను చూపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ బాతు.. ఒడ్డున ఉన్న ఆహారపు కంటైనర్ నుండి నీళ్ళల్లో బాగా ఆకలితో ఉన్న చేపలకు తన నోటితో ఆహారాన్ని అందిస్తూ వాటి ఆకలి తీరుస్తుంది. అయితే ఆ దృశ్యం చూస్తే.. ఎవరికైనా సరే కెమెరాలలో బంధించాలనిపిస్తుంది..      

 

మళ్ళి మళ్ళి ఆ దృశ్యాలను చూడాలి అనిపిస్తుంది. అలానే అనిపించింది ఓ వ్యక్తికి. అంతే అది కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. ఆ బాతు ఆహారం అందించడం.. అక్కడ నీళ్లలో ఉన్న చేపలు లాక్కోనిలాక్కోని తినడం అంత ఆ వీడియోలో ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఉన్న వీడియోని చుసిన నెటిజన్లు అంత వావ్ అనడమే సరిపోయింది.            

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిలియన్ మత్స్యకారుల పేరిట ఉన్న 'Dias e Noites De Pesca' అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో శనివారం పోస్ట్ అయింది. అయితే ఆ వీడియో పోస్ట్ అయినా 18గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్, 2.8 లక్షల షేర్లు, వేలాది కామెంట్లు వచ్చాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: