రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. దీంతో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులు ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతారని కామెంట్లు చేయటం స్టార్ట్ చేశారు. అటువంటి తరుణంలో వెంటనే పవన్ కళ్యాణ్ ఓటమి నుండి తేరుకుని కట్టె కాలే వరకు సినిమాలు చేయను ప్రజా సమస్యల కోసం పోరాడుతా అంటూ ఓడిపోయిన తర్వాత వెంటనే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో అన్ని విషయాలను పార్టీ కార్యకర్తల దగ్గర నుండి సూచనలు, సలహాలు పవన్ కళ్యాణ్ తెలుసుకోవటం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో ముందు నుండి రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి వైయస్ జగన్ ని టార్గెట్ చేస్తూ దారుణమైన విమర్శలు చేస్తూ పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఇటీవల తాజాగా బిజెపి పార్టీతో చేతులు కలపడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అధికారమే లక్ష్యంగా బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ నీ సొంత పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు బిజెపి పార్టీతో కలవడం పై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో తాజాగా జనవరి 20వ తారీకు నుండి మళ్ళీ వెంటనే సినిమారంగంలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడంతో మరింతగా విమర్శలు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై వస్తున్నాయి.

 

రాజకీయాలు చేత కానప్పుడు చేతకానితనం గానే ఉండాలి పార్టీ ఓడిపోయాక కట్టె కాలే వరకు సినిమాలు చెయ్యను అంటూ డైలాగులు కొట్టి ఎన్నికల ప్రచారసమయంలో చచ్చిపోయినా బతికిన బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని డైలాగులు వేసి ఇప్పుడు బిజెపి పార్టీ తో కలసి పని చేస్తూ మరో పక్క సినిమాలు చేయటం నీలాంటి వాడిని రాజకీయ నాయకుడిగా గుర్తించడం మేము చేసుకున్న సిగ్గుచేటు అని నిన్ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించడం లో తప్పులేదు వాళ్లకి ఉన్న జ్ఞానం కూడా మాకు లేదు అంటూ జనసేన పార్టీ మద్దతుదారులు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తాజాగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై జనవరి 20వ తారీఖు మళ్లీ సినిమారంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మొదటి అడుగు వేస్తున్న సమయములో పార్టీ కార్యకర్తల నుండి అభిమానుల నుండి ఈ విధమైన రెస్పాన్స్ రావడం పవన్ కళ్యాణ్ కెరీర్లో జారీ పడినట్లేనని ఇది ఊహించని పరిణామమని పవన్ కళ్యాణ్ తీరుపై కొంతమంది విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: