టిడిపి అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇప్పుడిప్పుడే ప్రజలకు బాగా అర్థం అవుతోంది. రాజధానిగా అమరావతిని ఉంచాలని చంద్రబాబు, ఆయన బృందం రైతులను రాజకీయం కోసమే రెచ్చగొడుతున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఇందులో రైతులకు గాని ప్రజలకు కానీ కలిసి వచ్చేది ఏమీ లేదన్న విషయం చంద్రబాబు కూడా బాగా తెలుసు. బాబు గత రాజకీయాలను చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది అనేది గతంలోనే చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా విడిపోదు అని గట్టిగా వాదిస్తూ రాజకీయాలు నడిపించారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించినట్టు పెద్ద ఎత్తున విమర్శలు ఆయన మూటగట్టుకున్నారు.


 విభజన తర్వాత విభజనకు ముందు అసలు ఏపీకి ఏం కావాలి అనే విషయంపై కేంద్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సూటిగా అడిగినా  చంద్రబాబు మాత్రం అసలు రాష్ట్రం విడిపోవడానికి కుదరదంటూ పైపైన రాజకీయమ్ నడిపించారు. ఇప్పుడు అమరావతిలో అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికీ అన్ని విధాలుగా రాజధాని తరలించేందుకు జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఉద్యోగులను విశాఖకు తరలించే దిశగా వారికి అనేక రకాల  హామీలు ఇస్తూ వారి కోరికలు ఏంటో ముందుగానే తెలుసుకుని వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.


 అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు కూడా ప్రభుత్వం ఇటువంటి ఆఫర్ ని ప్రకటించింది. మీకు ఏం కావాలో చెప్పాలని పదే పదే కోరుతోంది. అమరావతిలో రాజధాని ఉంటుందని, దానితోపాటు మిగిలిన రెండు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం ద్వారా ఏపీకి న్యాయం జరుగుతుందని గట్టిగా చెబుతోంది. అందుకే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రాంతీయ వాదం మరింతగా పెరిగి రాష్ట్రంలో విభజన ప్రతిపాదనలు వస్తాయని వైసిపి నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇంతగా చెబుతున్నా ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేడు. 


ఈ వ్యవహారంలో చంద్రబాబుకు ఇబ్బంది లేకపోయినా రైతులకు మాత్రం తీరని అన్యాయమే జరుగుతుందనేది బహిరంగ రహస్యం. అది కాకుండా స్వయంగా ప్రభుత్వమే ముందుకు వచ్చి మీ కోరిక ఏమిటో చెప్పండి తీరుస్తామని రైతులను కోరుతున్నా తమ రాజకీయ లబ్ధి కోసం వారి భవిష్యత్తును పణంగా పెడుతూ చంద్రబాబు రాజకీయం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: