సోషల్ మీడియా విజృంభించిన తరువాత ప్రతి అంశం ఇక్కడ చర్చకు రావడం, దీనిపై వివిధ కోణాల్లో చర్చ జరగడం, దానిపై ఎవరికి వారు తమ స్పందనను తెలియజేయడం, కొన్ని కొన్ని వైరల్ అవ్వడం సర్వసాధారణంగా మారింది. ఏపీలో ప్రస్తుతం హాట్ అండ్ వైరల్ న్యూస్ ఏదైనా ఉందా అంటే అది రాజధాని వ్యవహారమే. ఒక్కో రాజకీయ పార్టీ  మద్దతుదారు ఒక్కో విధంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి పరిరక్షణ సమితి పేరుతో సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. 


ఏపీలో మూడు రాజధానులు సీఎం జగన్ అసెంబ్లీలో ఈ రోజు ఆమోదముద్ర వేయించాలని  చూస్తుండగా, అదే రోజు అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. దీనిపై ముందుగానే వైసిపి విజయవాడలో మూడు రాజధానులు మద్దతుగా ర్యాలీలు చేపట్టింది.  అసెంబ్లీ ముట్టడి కి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలంటూ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


రాజదానిపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కులం, మతంతో సంబంధం లేకుండా అందరూ ఒకసారి మీ మనసుతో ఆలోచించి అసెంబ్లీ ముట్టడికి తరలి రండి. ఇది ఎవరి ఇంట్లో పెళ్లి కాదు.. చూస్తూ కూర్చోడానికి అందరూ కలిసి పోరాడితే పోయేది ఏమీ లేదు. ప్రజా ఉద్యమాల నుండి ఎటువంటి నాయకులు అయినా ప్రభుత్వం అయిన తలవంచాల్సిందే. ముఖ్యంగా రైతులను, ఆడవారిని చులకనగా చూస్తున్న ఈ నాయకులకు మన రేపటి ప్రదర్శన దేశానికి ఆదర్శం కావాలి. 5000 మంది పోలీసులు ప్రజల్ని ఏమైనా చేయగలరా ? ఎవరూ ఏమీ చేయలేరు ?


 శాంతియుతంగా ధర్నా చేయడం మా హక్కు, పోరాడి సాధించుకుందామా లేక చేతగానివాడి లాగా చరిత్రలో నిలిచిపోదామా ? ఈ సందేశం గురించి చదివే ప్రతి ఒక్కరూ  నాకెందుకులే అనుకుంటే ఈ సమాజాన్నిప్రశ్నించే హక్కు నీకు ఉంటుందా ? గ్రౌండ్లో, కాఫీ హోటల్ దగ్గారా, ఆపీసుల్లో ఈ సమాజం ఎలా అయిపోతుందని ఒకటే ఊక దంపుడు ఉపన్యాసాలు మాత్రం చెప్పకండి . పోలీసులు ఏమీ చేయరు ? చేస్తే చేయనీయండి  కానీ వెనక్కి మాత్రం వెళ్ళద్దు ! అసెంబ్లీ ఎక్కడికి పోదు, మన రాజధానిని మనమే కాపాడుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: