ఏపీ రాజధాని భవిష్యత్ తేలిపోనుంది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సీఎం జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టనుంది. 2020, జనవరి 20 తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాజధాని అంశాన్ని సభలో ప్రవేశ పెట్టి..చర్చించనుంది. పరిపాలన రాజధాని విశాఖపట్టణం, రాష్ట్రంలో మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టంలో మార్పులు లాంటి..కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.

 

సోమవారం ఉదయం తొలుత కేబినెట్ భేటీ నిర్వహించనున్న జగన్... వెంటనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నారు. ముందుగా జరగనున్న కేబినెట్ భేటీలో రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపి వెంటనే సదరు నివేదకకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించేలా ప్లాన్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

వైపు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఒప్పుకునేది లేదంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు వారికి మద్దతుగా టీడీపీ సాగిస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 33 రోజుకు చేరుకున్నాయిఇందుకోసం పకడ్బందీ ప్లాన్ ను కూడా జగన్ రచించుకున్నట్లుగానే సమాచారం. అమరావతి పేరిట టీడీపీ సర్కారు పాల్పడ అవినీతిని ఫోకస్ చేస్తూనే... అవినీతిని కూకటి వేళ్లతో పెలికించేలా వ్యవహరిస్తున్న జగన్... మూడు రాజధానులపై ఏమాత్రం వెనక్కు తగ్గరన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

 

అందులో భాగంగా.. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే కొత్త చట్టం సిద్దం చేసింది. అమల్లో న్యాయ పరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ సంప్రదింపులు కొనసాగిస్తోంది. అందులో భాగంగా.. రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం..ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్‌ ఆఫ్ ఆల్ రిజీయన్స్‌ బిల్‌-2020 పేరుతో కొత్త బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది

 

మరింత సమాచారం తెలుసుకోండి: