ఏపీలో ఇప్పుడంతా రాజధానిపైనే చర్చ జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ గుంటూరుల మధ్య అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే... జగన్ సీఎం అయ్యాక అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్ కు పరిమితం చేసేసి కీలకమైన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో జ్యుడిషియల్ కేపిటల్ ను కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా వైసీపీ సర్కారు చర్యలు మొదలుపెట్టింది.

 

రాజధాని తరలింపు ప్రకటన తర్వాత ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం చెరువు నుంచి శాసనసభకు రావడానికి వీలుగా రోడ్డును(జడ్‌ రోడ్డు) గతంలో ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రారంభోత్సవ సమయంలో ఎమ్మెల్యేలు, ఇతరులు రావటానికి వీలుగా దీన్ని నిర్మించారు. తర్వాత నుంచి దీన్ని వినియోగించడం లేదు

 

అందులో భాగంగా సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో..రాజధాని పేరెత్తకుండానే...అధికార వికేంద్రీకరణ దిశగా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం. రాజధాని పేరు ప్రస్తావిస్తే న్యాయ పరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..రాజధానులుగా ఎక్కడా ప్రస్తావించకుండా..జాగ్రత్తగా..న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా తాము అనుకున్న విధంగా అధికారిక విధులను వికేంద్రీకరిస్తూ బిల్లును సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

 

నివేదికకు రేపటి కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయనున్న జగన్... వెంటనే ఎంతమాత్రం గ్యాప్ ఇవ్వకుండానే అసెంబ్లీలో నివేదికకు ఆమోదం లభించేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజధాని విషయంపై జరుగుతున్న రచ్చకు రేపటి కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశాలతో జగన్ చెక్ పెట్టేయనున్నారన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: