తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను తెస్తున్నా, అత్యాచారాల కేసు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా నేరాల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 45 సంవత్సరాల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత ఆమె మెడకు చీరతో ఉరి వేసి ఆత్మహత్య చేశారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ శివారులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహిళకు మద్యం తాగించి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులకు పొలం పనుల కొరకు వెళ్లిన రైతులు ఉరి వేసుకున్న మహిళను గుర్తించి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను కిందికి దింపి పోస్టుమార్టం కొరకు మహిళ మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసులు అత్యాచారం, హత్యకు గురైన మహిళను హుత్నూర్ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన మన్నె అనసూయగా గుర్తించారు. పోలీసుల విచారణలో అనసూయ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేదని గత కొన్ని నెలల నుండి మహిళ మద్యానికి బానిసైందని తెలిసింది. దుండగులు ఆమెతో కలిసి మద్యం తాగి ఉండొచ్చని ఆ తరువాత మహిళను అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోస్టుమార్టం నివేదిక తరువాత మహిళ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. మహిళకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో మహిళ మృతి గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: