చంద్రబాబునాయుడు దెబ్బకు పునాదులే కదలిపోతున్నాయి. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టినప్పటి నుండి  అనేక ప్రాంతాలు పార్టీకి బలమైన మద్దతునిస్తున్నాయి. ఇటువంటి వాటిల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటి.  ఎప్పుడో ఓసారి వైఎస్ గాలిలో మాత్రమే ఇక్కడ టిడిపి వెనకబడింది. అంటే 1983 నుండి జరిగిన ఎన్నికలను తీసుకుంటే  చాలా సార్లు  తెలుగుదేశంపార్టీనే ఆధిక్యత సాధించిందనటంలో  సందేహం లేదు.

 

అలాంటిది మొదటిసారి మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టిడిపి తుడిచిపెట్టుకుపోయింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో  టిడిపి గెలుచుకున్నది కేవలం ఐదంటే ఐదు మాత్రమే. సరే ఎప్పుడోసారి ఇలాంటి దెబ్బ పడటం మామూలే కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పుంజుకుంటుందని అనుకున్నారు తమ్ముళ్ళు.

 

కానీ  మూడు రాజధానుల ప్రతిపాదనకు చంద్రబాబునాయుడు వ్యతిరేకంగా  ఉద్యమాలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. రాజధానిని అమరావతి నుండి తరలించేదుకు లేదంటూ జగన్ కు వార్నింగులిస్తున్నారు. అంటే విశాఖపట్నంను రాజధానిగా చేయాలన్న జగన్ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తు దీక్షలు కూడా చేస్తున్నారు. జనాలను విశాఖకు వ్యతిరేకంగా రెచ్చ గొడుతున్నారు. దాంతో చంద్రబాబు చేష్టలపై ఉత్తరాంధ్రలోని టిడిపి నేతలు మండిపోతున్నారు.

 

 విశాఖపట్నాన్ని రాజధానిగా వ్యతిరేకిస్తు చంద్రబాబు చేస్తున్న ఆందోళనల వల్ల మొత్తం ఉత్తరాంధ్రలోనే పార్టీ పునాదులు కదిలిపోతున్నాయంటూ  భోరుమంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలను చూసుకుని మొత్తం ఉత్తరాంధ్రనే చంద్రబాబు వదులుకుంటున్నాడని తమ్ముళ్ళు బాధపడిపోతున్నారు. 

 

పోనీ గుంటూరు, కృష్ణా జిల్లాలేమైనా పార్టీకి కంచుకోటలా అంటే అదీకాదు. టిడిపితో పాటు కాంగ్రెస్ ఇపుడు వైసిపి కూడా కాస్త అటు ఇటుగానే సీట్లను  పంచుకుంటోంది. మొన్నంటే ఈ జిల్లాల్లో కూడా తుడిచిపెట్టుకుపోయిందనుకోండి అది వేరే సంగతి. అంటే క్షేత్రస్ధాయిలో వాస్తవాలు చూసిన తర్వాత  ఉత్తరాంధ్రలో పార్టీ పునాదులే కదిలిపోవటం ఖాయమనే తోస్తోంది.  మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయానికి అధికారికంగా ముద్రపడటం ఖాయం.  తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఈ విషయం బయటపడుతుంది లేండి.

మరింత సమాచారం తెలుసుకోండి: