ఈరోజు అమరావతి పై ఫైనల్ వెర్డిక్ట్ రాబోతున్నది.  కేబినెట్ మీటింగ్ ఆ తరువాత జరిగే అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలు ప్రజలకు చేరువ కాబోతున్నాయి.  ఈ నిజాలను అనుసరించి అన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు.  అయితే, ప్రతిపక్షాలు మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు.  అమరావతి రైతులతో కలిసి అడ్డుకోవడానికి సిద్ధం అవుతున్నారు.  అడ్డుకుంటే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయని అంటున్నా, ప్రజలు మాత్రం దానికి ససేమిరా అనడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, జీన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చింది.  అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అన్నది జగన్ ప్రభుత్వం అభిమతం.  అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే అంతటా అభివృద్ధి కనిపిస్తుంది.  అలా కాకుండా కొంతవరకు మాత్రమే అభివృద్ధిని చూడాలి అంటే మాత్రం కుదరని పని.  అందుకే అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఒక్క అమరావతిలో మాత్రమే అభివృద్ధి జరిగితే హైదరాబాద్ లెక్కన ఒకేచోట ఉండిపోతుంది.  


మిగతా ప్రాంతాల్లో సరైన అభివృద్ధి కనిపించదు.  అందుకే జీన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని మూడు ప్రాంతాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనిచూస్తున్నారు .  మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోతారు.  అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిన ప్రాంతంలో ప్రజలు ఉంటారు.  హైదరాబాద్ లో జనాభా పెరగడానికి కారణం ఇదే.  ఒకే చోట అభివృద్ధి ఉన్నది కాబట్టి అప్పట్లో అందరూ హైదరాబాద్ వైపుకు చూశారు. 


అలా కాకుండా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెంది ఉంటె మరోలా ఉండేది.  అందరూ కూడా అన్ని చోట్ల ఉండిపోయేవారు.  అంతటా ఆ ఫలాలు కనిపించేవి.  అవి గతంలో జరగలేదు.  అందుకే ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  ఇప్పుడు అలా జరగకూడదు అని చెప్పి జగన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.  అందరిని ఒకే చోటకు చేర్చకుండా, అభివృద్ధి వికేంద్రకరణ చేయడం వలన సొంత ప్రాంతంలోనే ప్రజలు ఉండి అక్కడి నుంచే తమ పనులు చక్కదిద్దుకుంటారు.  ముఖ్యంగా ఉత్తరాంధ్రా, రాయలసీమ నుంచి వలసలు తగ్గిపోతాయి.  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.  గతంలోని ప్రభుత్వం నారాయణ కమిటీని వేసి అమరావతిని ఏర్పాటు చేసింది.  ఇప్పుడు జీఎన్ రావు కమిటీని వేసి వైకాపా ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: