ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా కమిటీలు వేస్తుంది.  ఎందుకంటే కమిటీల ద్వారానే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయి.  గతంలో అమరావతి ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీ నారాయణ కమిటీ వేసింది.  అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీని వేసింది.  ఈ కమిటీల పని నిజాలను నిగ్గు తేల్చడమే అనే విషయం అందరికి తెలుసు.  నారాయణ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించి అమరావతి నిర్మాణం వైపుకు మొగ్గు చూపిందని వాదనలు ఉన్నాయి.  


కానీ, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వేసిన జిఎన్ రావు కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి ఒక చోట కాకుండా అన్ని చోట్ల అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, దానికి అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ సాగాలని, ఇందులో భాగంగానే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  ఈ నివేదిక ఆధారంగానే జగన్ ప్రభుత్వం రాజధానిని మూడు చోట్ల ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణను చేస్తున్నది.  ఈ వికేంద్రీకరణలో భాగంగా విశాఖ, అమరావతి, కర్నూలు ప్రాంతాల్లో అభివృద్ధిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది.

 
ఇక ఇదిలా ఉంటె, జీఎన్ రావు కమిటీ నివేదికలను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుండటం విశేషం.  ఎందుకని కమిటీ ఈ నివేదికను వ్యతిరేకిస్తుందో అర్ధం కావడం లేదు.  ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని బాబుగారు భయపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు.  నిజానిజాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.  కానీ, చంద్రబాబు మాత్రం దీనిని కాదని పక్కన పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.  ఇందులో భాగంగానే కమిటీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.  


ప్రజలను మభ్యపెట్టడానికి అమరావతి ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.  రాజధానిలో రైతులు బాబు మాయలో పడొద్దని, రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయబోడని వైకాపా ప్రభుత్వం చెప్తున్నది. అయినా సరే ఇక్కడ ప్రజలు ఉద్యమం చేస్తున్నారు.  కారణం బాబే అని చెప్పాలి.  ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంత ఇబ్బందులు సృష్టించారు.  ప్రజలను తన మాటలతో యుద్ధం చేసేలా చేస్తున్నారు.  వాస్తవాలను పక్కదోవ పట్టిస్తున్నారు.  కాగా, ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని నిజాలు బయటపడబోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: