అమరావతిలో రైతులు ఆందోళనలు రోజు రోజుకు ఉదృతం అవుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభావం అమరావతిపై ఉన్నది.  ఈ నాలుగు జిల్లాల ప్రజలు అమరావతిని తరలించేందుకు వీలు లేదని అంటున్నారు.  అమరావతి ప్రజలకు అండగా నిలుస్తూ వారికోసం పోరాటం చేస్తున్నారు.  అయితే, అమరావతి విషయంలో గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఆందోళనలు చేశారు.  అలానే రాజమండ్రిలో కూడా ఆందోళనలు చేపట్టారు.  


ఆ ఆందోళనలు, నిరసనలు కొన్ని రోజులకే పరిమితం అయ్యాయి.  ఇప్పుడు దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు.  ప్రజలు ముఖ్యంగా తమ పనులపై దృష్టి పెట్టారు.  రాజధానితో తమకు సంబంధం లేదని అంటున్నారు.  ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఒకటే అనే ధోరణిలో ఉన్నారు.  అమరావతి రావాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.  అదే విశాఖకు వెళ్లడం వాళ్లకు ఈజీ.  ఆ రెండు జిల్లాల నుంచి నేరుగా విశాఖకు రైలు మార్గం, బస్సు మార్గం ఉన్నది.  అందుకోసమే ఉభయగోదావరి జిల్లాల ప్రజలు అమరావతి విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు.  


అమరావతిని అభివృద్ధి చేయడం వలన అభివృద్ధి ఒకేచోట ఆగిపోతుంది.  అలా కాకుండా అన్నిచోట్ల కూడా అభివృద్ధి జరగాలి అంటే తప్పకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి జరగాలి.  ఇందులో భాగంగానే వైకాపా ప్రభుత్వం, అమరావతితో పాటుగా విశాఖ, కర్నూలు జిల్లాలను కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధం అయ్యింది.  రాయలసీమలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాయి.  అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.  


గోదావరి జిల్లాల నుంచి జగన్ కు ఎక్కువ మద్దతు లభిస్తున్నది అనే విషయం తెలిసిందే.  ఈ రెండు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నా, గత ఎన్నికల్లో ఆ పార్టీని కాదని, వైకాపాకు ప్రజలు ఓటు వేసి గెలిపించారు.  ఈ గెలుపు కారణంగా అక్కడి ప్రజలకు విశాఖను రాజధానిని చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు.  కాగా, ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలను చర్చించబోతున్నారు. మరికాసేపట్లోనే దీనిపై నిర్ణయం వెలువడబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: