ఈరోజు ఏపీ ప్రభుత్వం నుండి రాజధానుల గురించి స్పష్టత రానుంది. ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ నిర్ణయానికే కట్టుబడి ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న సమయంలో రాజధాని అమరావతికి సంబంధించిన అన్ని పనుల్లో అప్పటి మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరించారు. కానీ 2019 ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ కార్యక్రమాలకు నారాయణ దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
నాడు అంత కీలకంగా వ్యవహరించిన నారాయణ నేడు పార్టీ కార్యక్రమాలకు, అమరావతి విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పూర్తిగా దూరం కావటానికి చంద్రబాబే కారణమని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా నారాయణ కేబినేట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐదేళ్లు మంత్రిగా వెలుగు వెలిగిన నారాయణ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ కార్యక్రమాలలో కనిపించటం లేదు. 
 
నారాయణ వైసీపీ ప్రభుత్వం తన ఆదాయ వనరులపై ఎక్కడ దెబ్బ కొడుతుందో అని దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు మున్సిపల్ శాఖా మంత్రిగా, సీఆర్డీఏ ఛైర్మన్ గా నారాయణ ముందు ఉండి టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కథ నడిపారు. రాజధాని కోసం చంద్రబాబు ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా కూడా నారాయణ చంద్రబాబు వెంటే ఉండేవారు. 
 
అమరావతిలో భూ సేకరణ ప్రారంభమై పూర్తయ్యే వరకు కూడా జరిగిన ప్రతి పనిలో నారాయణ ఉన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయం కూడా నారాయణకు తెలుసని గుసగుసలు వినిపిస్తున్నాయి. నారాయణకు ఏ టీడీపీ నేత ఎంత భూములు కొనుగోలు చేశారు...? ఎక్కడెక్కడ ఆ భూములు ఉన్నాయి..? అనే వివరాలు కూడా తెలుసని నారాయణ తెర ముందుకు వస్తే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల భాగోతాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని భావించి నారాయణను చంద్రబాబు తెర వెనుక ఉంచారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అమరావతిలో భూముల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు బయటకు వస్తే ప్రమాదమని చంద్రబాబు నారాయణను తెరవెనుక ఉంచి సేవ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: