అమరావతి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్.. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా.. లేక.. మూడు రాజధానులకు జగన్ సర్కారు పచ్చజెండా ఊపుతుందా అన్నది కొన్ని గంటల్లో తేలుతుంది. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా పోరాడుతున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాల పర్యటనలు కూడా చేశారు.

 

అమరావతి కోసం చంద్రబాబు మరోసారి జోలె కూడా పట్టారు. రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యమాలు చేస్తున్నారు. వారికి చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాటం కోసం ఆయన జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు పోగు చేస్తున్నారు. అయితే ఈ యాత్రకు అంతగా స్పందన కనిపించడం లేదు.

 

కృష్ణా గుంటూరు జిల్లాల్లో కాస్త స్పందన కనిపించినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పిలుపునకు జనం నుంచి స్పందన కరవైంది. ఈ జిల్లాల ప్రజలు ఎందుకు అమరావతిని సపోర్ట్ చేయడం లేదన్నది పరిశీలించాల్సిన విషయం. ఈ జిల్లాలకు అమరావతి తో పెద్దగా బాండింగ్ లేదు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాకు ఆనుకునే ఉంటుంది. అయినా ఆ జిల్లా నుంచి పెద్దగా అమరావతే రాజధానిగా ఉండాలన్న డిమాండ్ వినిపించడంలేదు.

 

ఇక తూర్పు గోదావరి జిల్లాకు అటు విజయవాడ అయినా.. విశాఖ పట్నం అయినా పెద్దగా తేడా ఉండదు. అందుకే ఈ కారణాలతోనే ఉభయ గోదావరి జిల్లాలు అమరావతిని రాజధానిగా వద్దనుకుని ఉండాలి. అసలు రాజధాని అన్నది ఓ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం. అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు రాష్ట్రం మొత్తం నుంచి స్పందన కనిపించాలి. కానీ అలాంటి పరిస్థితి లేదు. అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాలే ఇందుకు కారణం అని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: