అమరావతి రగడ రోజురోజుకు పెరిగిపోతున్నది.  ఈరోజు ఉదయం 9 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగబోతున్నది.  ఈ మీటింగ్ అనంతరమే శాసనసభను ఏర్పాటు చేయబోతున్నారు.  అక్కడే అన్ని విషయాలు చర్చకు రాబోతున్నాయి.  అయితే, అమరావతిని తరలిస్తే రైతులు తమ ప్రాణాలు తీసుకుంటామని, తమను తొక్కుకుంటూ వెళ్లి అమరావతిని తరలించాలని అంటున్నారు.  గత నెలరోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా, ఈ నాలుగైదురు రోజుల నుంచే ఉద్యమం మరింత ఉదృతంగా మారింది.  రైతులు అమరావతి గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఆందోళనలు చేస్తున్నారు.  


దీంతో అమరావతి ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.  ఎక్కడికక్కడ భారీకేట్లు, కంచెలు ఏర్పాటు చేసి రైతులను, ప్రజలను అడ్డుకుంటున్నారు.  ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.  ముఖ్యమంత్రి జగన్, మంత్రులు వెళ్లే కాన్వాయ్ లను ప్రజలు అడ్డుకోకుండా ఉండేందుకు పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు.  అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులను భారీగా మోహరించారు.  


దాదాపుగా 5వేలమంది పోలీసులను మోహరించి ఆందోళనలు జరగకుండా చూస్తున్నారు.  ఈ ఆందోళనలు నుంచి బయటపడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  నిన్నటి రోజున  ట్రయిల్ రన్ నిర్వహించారు.  ఎక్కడికక్కడ ప్రజలు, ఆందోళన కారులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈరోజు ఛలో అసెంబ్లీ ఉండటం వలన దానిని అడ్డుకోవడానికి ఇప్పటికే పోలీసులు వివిధ పార్టీల నాయకులకు నోటీసులు జారీ చేశారు.  నిన్నటి రోజున వాళ్ళను హౌస్ అరెస్ట్ చేశారు.  


హౌస్ అరెస్ట్ లు చేయడం వలన ప్రభుత్వం ఏం సాధించబోతున్నది.  ప్రజాప్రతినిధులను గృహనిర్బంధం చేసి అమరావతిని తరలిస్తే, అది ప్రభుత్వం విజయం ఎలా అవుతుంది అన్నది ప్రజల వాదన.  నిరసనలు తెలిపే అధికారం ప్రతిఒక్కరికి ఉన్నది.  దానిని ప్రభుత్వం అడ్డుకోవచ్చు.  కానీ, ఇలా అడ్డుకోవడం మంచిది కాదని అంటున్నారు.  కేంద్రంలో సిఏఏ ను తీసుకొచ్చినపుడు ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.  వారిని అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి.  కానీ, ఇలా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేయలేదని అంటున్నారు.  ప్రస్తుతం అమరావతి ప్రాంతాన్ని చూస్తుంటే, శ్రీనగర్ గుర్తుకు వస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: