గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా గుంటూరు విజయవాడ మధ్య ఏర్పడిన కొత్త నగరమే ఈ అమరావతి. అసెంబ్లీ హైకోర్టు, సచివాలయం అన్ని నిర్మించారు. రాజధాని ఏర్పడిందని ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా సొంత ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇది మాత్రం నిన్నటి మాట. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం మూడు రాజధానులు ఏర్పాటు కావాలి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అమరావతిలో చట్టసభల రాజధాని విశాఖలో పరిపాలన రాజధాని కర్నూలులో న్యాయపరమైన రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 

 

 

 రాజధాని అధ్యయనం కోసం జగన్ సర్కార్ నియమించిన కమిటీలు కూడా జగన్ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ నివేదికలు అందించాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం అట్టుడుకుతోంది. పార్టీల నేతలందరూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు అమరావతిలో కూడా రైతులందరూ రోడ్ల పైకి చేరి నిరసనలు తెలుపుతున్నారు. అమరావతి నిర్మాణం చేపడతామని అంటే  భవిష్యత్ తరాల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలిస్తే తమ త్యాగానికి అర్దం ఏముంటుందని తమకు అన్యాయం జరిగినట్లే అంటూ  ఆగ్రహావేశాలకు లోనయ్యి  ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలలో కూడా జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. 

 

 

 అమరావతి నుండి రాజధాని మార్పు చేయడానికి.. వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నది కేవలం అమరావతి ప్రాంత రైతులు తప్ప.. ఇతర మిగతా జిల్లాలకు చెందిన ఒక్కరు కూడా అమరావతి మార్చొద్దు అంటూ అని చెప్పడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతిపక్ష పార్టీలో కూడా జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలిపిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నేతలు తప్ప మిగతా నేతలందరూ కూడా విభజన నిర్ణయాన్ని కి మద్దతు తెలిపారు. అయితే ఒక్క అమరావతి ప్రజలు,  టిడిపిలో కొంతమంది నేతలు మినహా మిగతా అందరూ... అభివృద్ధి వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరూ తెర మీదికి వచ్చి అమరావతి నుండి రాజధాని మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: