ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం వేరు పడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మించాలని యోచనతో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మధ్యలో అమరావతి నగరాన్ని నిర్మించాడు. దీని కోసం రైతుల దగ్గర 30వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించింది టిడిపి సర్కార్. చట్టసభలు సచివాలయం హైకోర్టు అన్ని నిర్మించింది. ఇక 2019లో ఎన్నికల తర్వాత భారీ మెజారిటీ సొంతం చేసుకుని  అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రాజధాని అమరావతి లో జరిగిన అవకతవకలను తెరమీదికి తెచ్చింది. గ్రాఫిక్స్ చూపెట్టి చంద్రబాబు అమరావతిని తాత్కాలికంగా నిర్మించారంటూ  ఆరోపించింది. ఇక అభివృద్ధి గురించి ఆలోచించడం జగన్మోహన్ రెడ్డి సర్కార్  రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని రాజధాని ఏర్పడే అవకాశం ఉందని తేల్చిచెప్పింది. 

 

 

 విశాఖలో పరిపాలన రాజధాని కర్నూలులో న్యాయపరమైన రాజధాని అమరావతి లో చట్టసభల రాజధాని కొనసాగించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. రాజధాని అధ్యయన కమిటీ లు కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించాయి. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 3 రాజధానిలో ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు అందరూ గోల పెడుతున్నారు. అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక 3 రాజధానుల నిర్మాణాన్ని తెరమీదికి తెచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ ఆరోపిస్తున్నారు అటు  అమరావతిలో కూడా రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

 

 

 ఇక అసలు విషయానికొస్తే... అమరావతిలో ఓ ఐదారు గ్రామాలు ప్రజలను పక్కనపెడితే.. మిగిలిన వారు రాజధాని మార్పు విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదని పలువురు అనుకుంటున్న మాట. కేవలం ఒక అయిదారు గ్రామాల ప్రజలు మాత్రమే రాజధాని అమరావతి తరలింపు నిరసిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు అని ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ విషయానికొస్తే.. టిడిపి కార్యకర్తలు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు ముఖ్య నేతలు మినహా మరెవరు రాజధాని అమరావతి మార్పును వ్యతిరేకించడం లేదని ఇప్పటికే అర్థమైంది కూడా. టీడీపీలోని పలువురు కీలక నేతలు కూడా జగన్  నిర్ణయానికి మద్దతు పలుకుతున్నట్లు ఇప్పటికే తీర్మానం కూడా చేశారు. దీంతో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు తప్ప ఎవరూ పోరాడటం లేదని అందరూ అనుకుంటున్న మాట. కాగా నేడు అమరావతి తరలింపుపై తేల్చనుంది జగన్ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: