అమరావతి రగడకు ఈరోజుతో ఫుల్ స్టాప్ ఆడుతుందా అంటే చెప్పలేం.  నెలరోజుల క్రితం ప్రారంభమైన ఈ ఆందోళన ఏ స్థాయికి వెళ్తుందో చెప్పడం కష్టమే.  ఎందుకంటే ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్ తరువాత దీనిపై ఓ స్పష్టత రావొచ్చు.  అసెంబ్లీలో చర్చకు వచ్చినపుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలిపోతుంది. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అర్ధంతరంగా చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసారో అందరికి తెలుసు.  


నోటుకు ఓటు కేసులో ఎక్కడ తాను బుక్ అవుతాడో అనే భయంతోనే బాబు ఈ పనికి పూనుకున్నారు.  హడావుడిగా విజయవాడ వచ్చి అక్కడ కొన్ని కార్యాలయాలు చూసుకొని అక్కడికి పాలనను తరలించారు.  కర్నూలు, దొనకొండ ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ బాబు అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేశారు.  అమరావతి నిర్మాణం కోసం అయ్యే ఖర్చు దాదాపు లక్ష కోట్లు అని అంచనా వేశారు.  అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉన్నదా అంటే లేదని చెప్పాలి.  


చేతిలో డబ్బులేకుండా బాబు ఎందుకని రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు.  అందులో అట్టహాసంగా అమరావతిని నిర్మించాలని కంకణం కట్టుకున్నారు.  అయితే, తాత్కాలిక భవనాలు ఎందుకు నిర్మించినట్టు, అవేవో శాశ్వత భవనాలు నిర్మిస్తే, ఇప్పుడు అమరావతి గొడవ వచ్చేది కాదుకదా.  కనీసం అప్పటి ప్రభుత్వం నిర్మాణాల కోసం 30శాతం నిధులు ఖర్చు చేసినా ఇప్పటి ప్రభుత్వం ఆ సాహసం చేసేది కాదు.  అయితే, బాబు ధీమా ఏంటి అంటే, ఈసారి కూడా తామే అధికారంలోకి వస్తాము.  అధికారంలోకి వస్తే, తప్పకుండా రాజధాని అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు.  


కానీ, ప్రజలు బాబుకు హ్యాండ్ ఇవ్వడంతో ఇబ్బందులు పడ్డారు.  ప్రజలు కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం చేయడంతో తెలుగుదేశం పార్టీ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటిగా మారిపోయింది.  ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాలు ఆ పార్టీకి చేటు చేశాయి.  ఈ మార్పుతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు.  అయితే, ఇప్పుడు ఈ ప్రభుత్వం డబ్బును వృధా చేయకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ చేసేందుకు కంకణం కట్టుకుంది.  రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.  అందుకే కష్టమైనా రాజధాని మార్పు తప్పడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: