ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల గురించి ప్రకటన చేసిన రోజు నుండి రాజధానుల గురించి ఇటు ఏపీ ప్రజల్లో అటు రాజకీయ నేతల్లో జరుగుతున్న చర్చ జరుగుతోంది. కానీ నేడు మూడు రాజధానుల ప్రకటన రావడానికి ఒక రకంగా చంద్రబాబే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత తాత్కాలిక నిర్మాణాలే తప్ప చంద్రబాబు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదు. 
 
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీలను నిర్మించింది. ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాత్కాలికం తప్పితే శాశ్వత నిర్మాణాల కోసం ఒక్క ఇటుక కూడా పడలేదు. చంద్రబాబు తాత్కాలిక నిర్మాణాల వలనే ఈరోజు మూడు రాజధానుల ప్రకటన వెలువడుతోందని సమాచారం. గడచిన ఐదు సంవత్సరాలలో రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. 
 
టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో భూసేకరణ మీద పెట్టిన శ్రధ్ధ రాజధాని అమరావతిపై పెట్టలేదు. అమరావతి రాజధానిగా అనుకూలం కాదని గతంలోనే కొన్ని కమిటీలు నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ నివేదికలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే, శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే మూడు రాజధానుల ప్రతిపాదనే వచ్చి ఉండేది కాదు. 
 
రాజధానిగా అమరావతిని ప్రకటించక మునుపే వేల ఎకరాల భూములను చంద్రబాబు, చంద్రబాబు సన్నిహితులు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కొరకే అన్ని వేల ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు నిజంగా ఏపీ ప్రజలపై ప్రేమ ఉండి అమరావతిని నిజంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉండి ఉంటే గడచిన ఐదేళ్లలో రాజధానిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఉంటే మాత్రం నేడు రాజధానిగా అమరావతి ఒక వెలుగు వెలిగి ఉండేదని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: