అమ‌రావ‌తి.. ఇప్పుడు అదే హాట్ టాపిక్‌. ఏపీ రాజధాని తరలింపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉండటంతో... దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.  ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. ఇలా అమరావతిలో టెన్షన్ పీక్ స్టేజ్‌కి చేరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉండటం, అసెంబ్లీ ముట్టడికి టీడీపీ పిలుపివ్వడంతో, హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రధానంగా ఈ సమావేశాలకు సీఎం జగన్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురానున్నారు. ఇక ఇప్ప‌టికే అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

 

ఇదిలా ఉంటే.. నిజంగా రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తి కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఏకం కాలేదు. రాజ‌ధాని గ్రామాలు 29 మంది కాదు. కేవ‌లం ఓ ఐదారు గ్రామాల ప్ర‌జ‌లు మాత్ర‌మే ఏక‌మ‌య్యారు. కానీ బాబు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర‌స‌న‌లు చేయిస్తూ రాష్ట్ర ఉద్య‌మం అంటున్నారు.. కానీ ప‌చ్చ మీడియాను ఏకంగా చేసి వార్త‌లు రాయిస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది టీడీపీ. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 

 కాగా, నేటి ఉదయం 9 గంటలకు సెక్రటేరియట్‌లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఇందులో ఇవాళ హైపవర్ కమిటీ ఇచ్చే రిపోర్టు, అలాగే ఇంతకు ముందే వచ్చిన జీఎన్‌ రావు కమిటీ రిపోర్టు, బీసీజీ రిపోర్టులపై చర్చించి, ఆమోదించే ఛాన్సుంది. ఒకే రాజధాని.. మూడు చోట్ల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక అసెంబ్లీలో మెజార్టీ వైసీపీదే కాబట్టి... ఆటోమేటిక్‌గా వైసీపీ నిర్ణయమే చెల్లుతుంది. మండలిలో మాత్రం టీడీపీకి మెజార్టీ ఉండటం వల్ల... అక్కడ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రవేశపెడతారని భావిస్తున్న బిల్లును అడ్డుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మ‌రి అమ‌రావ‌తిపై ఉత్కంఠ వీడాలంటే మ‌రికొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: