ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినఅంశం  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానుల నిర్ణయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి విపక్ష పార్టీలైన  టిడిపి బిజెపి జనసేన పార్టీ అని గగ్గోలు పెడుతున్నాయి  ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి విపక్ష పార్టీలు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అమరావతిలో కూడా తీవ్ర స్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు జరుగుతున్నాయి. 

 

 

 అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం మూడు రాజధానిలు  ఏర్పడే అవకాశం ఉంది అంటూ ప్రకటన చేసిన వెంటనే భిన్న  స్వరాలు వినిపించాయి. మొదట అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలిపిన బిజెపి ఆ తర్వాత వ్యతిరేక స్వరం వినిపించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అభివృద్ధి వికేంద్రీకరణ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. టిడిపిలో పలు కీలక నేతలు మాత్రం జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే  పార్టీలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. 

 

 

 బీజేపీ లో ఉన్న నేతలకు మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో మద్దతు తెలపాలా... వ్యతిరేకించాలా  అనేది  వారిలో వారికే క్లారిటీ లేదు. ఒకరేమో అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాం ఇదే ఫైనల్ అని చెబుతుంటే ఇంకొక రేమో  బిజెపి జగన్ నిర్ణయానికి వ్యతిరేకం అంటూ వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నది బీజేపీలోని సుజనాచౌదరి మాత్రమే. ఇక టిడిపిలో బాబోరి బ్యాచ్  మాట్లాడుతున్నట్లుగా సుజనాచౌదరి చిలకపలుకులు పలుకుతున్నారని ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు పార్టీలు పెద్ద డ్రామాలు ఆడుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: