జనసేన పార్టీకి ఉన్న ఏకైన ఎమ్మెల్యే రాపాక.  అయన ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు.  పార్టీ వ్యవహారాల్లో అంటి అంటనట్టుగా ఉంటున్నారు.  మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి జగన్ కు జైకొడుతున్నాడు రాపాక.  అయితే, రాపాక విషయంలో జనసేన పార్టీ ఇప్పటికి సైలెంట్ గానే ఉన్నది.  ఆయనపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.  పవన్ కళ్యాణ్ అమరావతికి జైకొడుతుండటంతో ఈ వాదనలు వినిపిస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా ఉన్నారని, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారని, దీని వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందలేవని అంటున్నారు.  


కానీ, జనసేన వెర్షన్ మాత్రం మరోలా ఉన్నది.  మూడు ప్రాంతాల్లో రాజధానులను పెట్టడం వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందవు అని అంటున్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణ ముసుగులో అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని, విశాఖలోని భూములపైనే కన్నేసిన జగన్ ప్రభుత్వం వాటికోసమే విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని మారుస్తోందని అంటున్నారు.  రాజధాని ఎక్కడ పెట్టినా తమకు ఇబ్బందులు లేవని చెప్తూనే, అన్ని ఒకేచోట ఉండాలని, అలా ఉంటేనే పాలన సాధ్యం అవుతుందని అంటున్నారు.  


అయితే, రాజధానిని అమరావతి నుంచి మార్చాలి అంటే మొదట అమరావతి రైతులకు న్యాయం చేసి, వారి సమస్యలకు పరిష్కారం చూపించిన తరువాత మాత్రమే ముందుకు వెళ్లాలని మార్పు గురించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  జనసేన పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో పార్టీకి దూరంగా ఉండటంతో ఏం జరుగుతుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  


అమరావతి విషయంలో ఈ రోజు సాయంత్రం పీఏసీ మీటింగ్ జరుగుతున్నది.  ఈ మీటింగ్ కు పార్టీనేతలు హాజరవుతున్నారు.  అయితే, ఎమ్మెల్యే రాపాకకు కూడా ఆహ్వానం పంపారు.  కానీ, ఆయన వస్తారా రారా అన్నది చూడాలి.  రాపాక వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.  రాకపోతే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.  అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే రాపాక ఎవరిపై ఓటు వేస్తారు అన్నది చూడాల్సిన అంశం.  మరికాసేపట్లోనే అమరావతికి సంబంధించిన కేబినెట్ మీటింగ్, అసెంబ్లీ సమావేశం జరగబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: