ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపైనే ఆంధ్ర రాజకీయాల్లో అందరూ చర్చించుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధాని ఏర్పడే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం... ఆ తర్వాత రాజధాని అధ్యయనం కోసం నియమించిన అన్ని కమిటీలు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదికలు అందించడంతో... అమరావతి నుంచి రాజధాని మార్పు అనివార్యం అయినట్లు అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన బిల్లును నేడు క్యాబినెట్ ఆమోదం తెలిపి అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. దీంతో అమరావతి నుంచి రాజధాని తరలిపోపోవటం అనేది స్పష్టంగా అర్థం అయిపోయింది.

 

 

 అయితే రాజధాని అమరావతికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు..?  అసలు రాజధాని అమరావతిని చంపేసింది ఎవరు..?  అనే ప్రశ్న తలెత్తితే  అందరికీ గుర్తొచ్చే పేరు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరే .ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతిని  నిర్మించింది. అమరావతిలోని చట్టసభల్లో సచివాలయం సహా హైకోర్టును కూడా నిర్మించి దీనికోసం రైతుల నుంచి 30 వేల ఎకరాలకు పైగా సేకరించారు. కాదు కాదు అక్రమంగా లాగేసుకున్నారు అనే టాక్ కూడా ఉంది. అమరావతి పై ప్రజల్లో ఎంతో అంచనాలను పెంచేశారు. బెంగళూరు తరహాలో  అమరావతి నిర్మాణం ఉంటుందని... సకల సౌకర్యాలతో అమరావతి నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. కానీ చంద్రబాబు మాటలు మాత్రం నీటి మూటలు అయిపోయాయి. 

 

 

 అటు అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిని కూడా గ్రాఫిక్స్ చూపించి తాత్కాలికంగానే నిర్మించారు అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అసలు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు తక్కువగా ఉన్నాయని.. రాజధాని మొత్తం తాత్కాలికంగానే నిర్మించారు అంటూ ఆరోపించింది జగన్ సర్కార్. అంతేకాకుండా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా జరిగిందని జగన్ మోహన్ రెడ్డి సర్కారు గుర్తించింది. అమరావతి నిర్మిస్తామని ముందుగానే తమ బంధువులు అందరికీ తెలిపిన చంద్రబాబు భారీగా భూములు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించారని జగన్  ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమరావతి పేరుతో ప్రజలను ఎంతగానో  చంద్రబాబు మోసం చేశారు అన్నది అందరు అనుకుంటున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: