అమరావతి ఆంధ్రుల కల అంటూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడలేని హడావుడి చేశారు. రాజధానిపై నియమించిన నిపుణుల కమిటీ కూడా రాజధానిగా అమరావతి సరైన ప్రాంతం కాదని, ఇక్కడ రాజధాని నిర్మిస్తే అనేక ఇబ్బందులు వస్తాయని, నిర్మాణ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయని అనేక రిపోర్టులు ఇచ్చినా  తెలుగుదేశం ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా కేవలం ఈ ప్రాంత లో ఉన్న ఒక సామాజిక వర్గానికి చెందిన వారి మెప్పు కోసం, రాజధాని ప్రకటనకు ముందే బినామీ పేర్లతో టిడిపి నాయకులు భారీగా భూములు కొనుగోలు చేయడంతో వారికి మేలు చేసే ఉద్దేశంతో  అమరావతిని రాజధాని గా ప్రకటించడం ఈ తతంగం అంతా జరిగింది. 


పోనీ టిడిపి ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు ఏవైనా శరవేగంగా జరిగాయా అంటే అది లేదు. కేవలం రకరకాల గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తూ ఐదేళ్లపాటు హడావుడి చేశారు. కేవలం కొన్ని తాత్కాలిక కట్టడాలు మాత్రమే కట్టింది. అవి కూడా నాణ్యత లేకుండా. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టగానే తెలుగుదేశం అనుకూల మీడియా గగ్గోలు పెడుతూ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం మొదలుపెట్టింది. అమరావతి నుంచి రాజధానిని తరలించేస్తున్నారు అంటూ హడావుడి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అనేక సర్వేలు చేయించింది. అమరావతిని బలంగా కోరుకునేది కృష్ణ, గుంటూరు జిల్లాలోనో ఒక సామాజిక వర్గం ప్రజలేనని తేలింది. 


జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు మిగతా ప్రాంతాల్లో అనుకూలత ఉన్నట్టు తేలిపోయింది. మొదటి నుంచి అమరావతి పరిసర ప్రాంతాల్లో  చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు టిడిపికి మద్దతుగా నిలబడుతూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఆ సామాజిక వర్గం వారే ఎక్కువగా పాల్గొంటున్నారు. కానీ ప్రజలంతా అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా బాబు అనుకూల మీడియా కూడా వంత పాడుతూ లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే  జగన్ ఆకాంక్షకు మిగతా 11 జిల్లాల వాసులు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు.


 కృష్ణ, గుంటూరు లో మాత్రం అక్కడ అక్కడ వ్యతిరేకత కనిపిస్తోంది. అయినా అమరావతి నుంచి రాజధాని తరలించే ఉద్దేశం లేదని, కేవలం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా తెలుగుదేశం పార్టీ దానిని వక్రీకరిస్తూ లేనిపోని భయాలు సృష్టిస్తోంది. ప్రభుత్వం కూడా నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కృష్ణ గుంటూరులో తప్ప మిగతా ఎక్కడా మూడు రాజధానుల ప్రతిపాదనపై వ్యతిరేకత లేదనే విషయం స్పష్టం కావడంతో జగన్ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: