రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టిడిపి నేతలు పెద్ద ఎత్తున రైతుల నుండి భూములను కొనేశారని వైసిపి  చేస్తున్న ఆరపణలను ఎల్లోమీడియా కూడా అంగీకరించింది.  అదే సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటి ? అని అమయాకంగా ప్రశ్నిస్తున్న చంద్రబాబునాయుడుకు తాజాగా ఎల్లోమీడియా వైఖరితో షాక్ కొట్టినట్లైంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ’నిండా ముంచేస్తారా’  అనే   హెడ్డింగ్ తో  లోపల పేజీల్లో పెద్ద కథనం ఇచ్చింది. అందులోను ఓ బాక్స్ ఐటమ్ గా ఓ నాలుగు లైన్లు ప్రచురించింది. ఇంతకీ ఆ బాక్సు ఐటమ్ లో ఏముందంటే  చేతులు మారిన ప్లాట్లు 20 వేలు అనే సబ్ హడ్డింగ్ తో కొన్ని వివరాలు ఇచ్చింది. అందులో ఏముందంటే రైతుల నుండి భూములు సేకరించిన ప్రభుత్వం అదుకు బదులుగా   రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చింది. 

 

మొత్తం 62, 896 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో భాగంగా  36, 522 నివాస స్ధలాలు, 25, 374 వాణిజ్య స్ధలాలను కేటాయించినట్లు చెప్పింది. అయితే కేటాయించిన  62, 896 ప్లాట్లలో  20 వేల ప్లాట్లు చేతులు మారినట్లు ఎల్లోమీడియా అంగీకరించటం ఆశ్చర్యంగా  ఉంది.  ఇదే విషయాన్ని వైసిపి నేతలు ఎప్పటి నుండో చెబుతున్నారు. అయితే దాన్ని చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు కొట్టి పారేస్తున్నారు.

 

ప్లాట్లున్న ప్రదేశం, వాటికి దగ్గర్లో వస్తాయనుకుంటున్న ప్రాజెక్టల ఆధారంగా వాటి ధరలున్నాయట. నివాస, వాణిజ్య స్ధలాలు అంటే వెయ్యి గజాలు+450 గజాలు మొత్తం మీద 1450 గజాలు దక్కాయి. రెండో పద్దతి ప్రకారం వెయ్యి గజాలు+ 250 గజాలు రైతులు అందుకున్నారు. అంటే ఎల్లోమీడియా చెప్పిన దాని ప్రకారమే 1450 గజాలు లేదా 1250 గజాల ధర కోట్ల రూపాయలు పలికిందట.  మార్కెట్ ధరలకు రాష్ట్రం, రాష్ట్రేతరులే కాకుండా విదేశాల్లోని వాళ్ళు కూడా కొనేశారట.

 

మొదటి నుండి వైసిపి చెబుతున్నదిదే.  రాజధాని ప్రకటించకముందే చంద్రబాబు అండ్ కో భారీ ఎత్తున భూములు కొనేశారని, ప్రభుత్వం భూ సమీకరణ చేసిన తర్వాత కూడా అంటే ప్రధానంగా అసైన్డ్ రైతుల నుండి భూములను టిడిపి ప్రముఖులు కొనుగోలు చేశారని వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు.  ఇపుడిదే విషయాన్ని ఎల్లోమీడియా అంగీకరించింది. కాకపోతే కొనుగోలు చేశారని చెప్పిందే కానీ ఎవరు కొన్నారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. తాము కొన్న ప్లాట్ల ధరలు పడిపోతున్నాయనే ఇపుడు చాలా మంది ఆందోళన పడుతున్నట్లు చెప్పటం కొసమెరుపు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: