సరైన  ఉద్యోగాలు రావాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిందే. పెద్ద పెద్ద చదువులు చదవగానే ఉద్యోగాలు వచ్చేస్తాయ అంటే  అలా ఎలా ఉంటుంది ఉద్యోగం కోసం ఒక ప్రత్యేకమైన కోర్స్ మళ్ళీ నేర్చుకోవాల్సిందే. పెద్ద పెద్ద చదువులు చదివి ప్రత్యేకమైన కోర్సులు నేర్చుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధిస్తూ ఉంటారు. ఇలా అన్ని ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు అదృష్టం అంతగా కలిసి రాక... ఉద్యోగాలు దొరకని వారు చాలామంది ఉంటారు. అయితే ప్రైవేట్ అయితే ఏమిటి గవర్నమెంట్ అయితే ఏమిటి ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించడం ముఖ్యం అని అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనే తపన తో ఎన్నో ఏళ్ల పాటు కష్టపడుతున్న వారు కూడా ఈ కాలంలో లేకపోలేదు.

 

 

 ఎంత కష్టమైనా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి అని పోటీ పరీక్షల కోసం ఎంతగానో సిద్ధమవుతున్న వారు ఉంటారు. అయితే పదో తరగతి ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసిన వాళ్ళు ఎక్కువగా నిరాశ చెందుతుంటారు. తక్కువ చదువు చదివిన తమకు సరైన ఉద్యోగాలు వస్తాయా అని ఆందోళన చెందుతూ ఉంటారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కు సంబంధించి అప్పుడప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు  నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. దీంతో సంబరపడిపోయి ఇంటర్మీడియట్ టెన్త్ చదివిన ఉద్యోగాలకు అప్లై చేసి చాలామంది ఉద్యోగాలను సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది తమ చదువుకు తగ్గ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంద అని నిరీక్షణ ఎదురుచూస్తూ ఉంటారు. 

 

 

 కాగా  ప్రస్తుతం ఇంటర్ చదివిన వారికి భారత వాయుసేన శుభ వార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది భారత వాయుసేన. రాతపరీక్షలో ప్రతిభ కనబరిస్తే.. గ్రూప్ x,  గ్రూప్ y లో ఉద్యోగం చేయవచ్చు. ఫిట్టర్ లేదా టెక్నీషియన్ హోదాలో  నెలకు 50 వేల రూపాయల వేతనంతో కెరీర్ ను  ప్రారంభించవచ్చు. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 19 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ ఉద్యోగాలకు చివరి తేదీ నేడే. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి...http://indianairforce.nic.in/ సంప్రదించండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: