రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరబాద్ నగరం ఏపీకి, తెలంగాణకు ముఖ్యమైన కేంద్రబిందువుగా మారింది. అ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఇంతకాలం ఒక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం రెండుగా విడిపోయి ఏపీ, తెలంగాణగా ఆవిర్భవించింది. ఈ పరిస్దితుల్లో తెలంగాణకు హైదరాబాద్ పెద్ద దిక్కుగా మారగా, ఏపీ విషయంలో రాజధాని అంశంగా అమరావతి తెరపైకి వచ్చింది. ఈ విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక డిజిటల్ గ్రాఫిక్‌తో, భారీ ప్రచారం చేపించుకున్నాడు.

 

 

ఇకపోతే 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, టీడీపీ. పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా, ప్రచార బరిలో దిగగా... వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే... నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి... ప్రచారం సాగించింది. ఇకపోతే చంద్రబాబు అమరావతి అని భ్రమ కల్పించి అమాయకులైన ప్రజల నుండి భూములు లాక్కుని చేసిన మోసాలు ఇప్పుడు ఒక్కోక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ దశలో అమరావతిని కనుక రాజధాని చేసుంటే ఇంకా ఏపీకి తీరని నష్టమే మిగిలేదని ఇప్పటి ప్రభుత్వం సాక్షాలతో సహా నిరూపించింది.

 

 

ఇదిలా ఉండగా ఏపీ వేరుపడిన తర్వాత దీనికి రాజధాని లేకుండా పోయింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైన ఒక నగరాన్ని అంటే దాన్ని హైదరాబాద్ కు సరిసమానంగా అంటే ఇంచుమించుగా  అభివృద్ధి చేసి ఉంటే ఈనాడు ఈ దుస్దితి తలెత్తేది కాదుకదా అనేది ప్రజల అభిప్రాయం. ఆయన పదవిలో ఉన్నంత కాలం ఎలా దోచుకుందాం అనే ఆలోచనల్లో గడిపాడని ఇప్పుడు సృష్టంగా తెలుస్తుందట. ఇక ఇప్పుడు మూడురాజధానుల ప్రస్దావన ఒకరకంగా మంచిదే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

 

 

ఎందుకంటే భవిష్యత్తులో రాయలసీమ ఒకవేళ వేరుగా ఉండాలనుకుంటే అప్పుడు ఇలాంటి దుస్దితి తలెత్తకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగి ఉంటాయి కాబట్టి ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదని కొందరు ఆలోచన చేస్తు చాలామంది ఈ విషయంలో వ్యతిరేకించకుండా ఉన్నారు. అందుకే అమరావతి రాజధాని గా వద్దని మార్చుతున్న ప్రజల్లో స్పందన పెద్దగా కనిపించడం లేదట. ఇక ఏపి ప్రజలకున్న ఆకాంక్ష ఏంటంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఎదుర్కొన్న సమస్య మళ్లీ పునరావృత్తం కాకుండా అన్ని ప్రాంతాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: