ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు ఉదయం ఏపీ కేబినేట్ సమావేశమైంది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న అంశాలపై మరియు బిల్లులపై చర్చ జరిగింది. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ బోస్టన్స్ కన్సల్టెన్సీ గ్రూప్, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ సీఎం జగన్ కు 130 పేజీల సమగ్ర నివేదికను ఇచ్చింది.                         
 
కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. కేబినేట్ ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది. 11 వేల రైతు భరోసా కేంద్రాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, విశాఖకు సచివాలయం, హెచ్.ఓ.డీ కార్యాలయాలు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కొరకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
భూములు ఇచ్చిన రైతులకు కౌలు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలకు పెంచటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. కేబినేట్ అమరావతి రైతులకు కూడా శుభవార్త చెప్పింది. కేబినేట్ రైతులకు మెరుగైన ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణను లోకాయుక్తకు అప్పగించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగిన కేబినేట్ భేటీలో కేబినేట్ సంచలన నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. హై పవర్ కమిటీ నివేదికను కేబినేట్ ఆమోదించటంతో అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిట్ ఏర్పాటు కానున్నాయి. మరికాసేపట్లో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: