మూడు రాజధానుల విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ కు ఇకపై మూడు రాజధానులు ఉండబోతున్నాయి.  కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూర్లు ఉండబోతున్నాయి.  మూడు రాజధానుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  దీని తరువాత ఈ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు.  


అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కర్నూలుకు జ్యుడిషియల్ రాజధాని అంటే మెచ్చుకోదగిన అంశం అని చెప్పాలి.  కర్నూలులు కొత్తకళ సంతరించుకోబోతోంది.  కర్నూలుకు జ్యుడిషియల్ రాజధానిని తీసుకు రావడంతో అక్కడ హైకోర్టు ఏర్పాటుతో పాటుగా మరికొన్నింటిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.  జ్యుడిషియల్ రాజధానిని డెవలప్ చేస్తే కర్నూలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి వసతి లభిస్తుంది.  


ఇతర సౌకర్యాలు లభిస్తాయి.  అన్నింటికి మించి అక్కడ రోడ్డు సౌకర్యం బాగుపడుతుంది.  పైగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవు.  దీంతో పాటుగా పాలనా పరమైన చిక్కులు ఉండవు.  అంతేకాదు, వ్యాపారసంస్థలు అభివృద్ధి చెందుతాయి.  మేధావులు వచ్చిపోయే నగరంగా కర్నూలు అభివృద్ధి చెందుతుంది.  వీటితో పాటుగా అనేక సంస్థలు కూడా కర్నూలు, దాని చుట్టుపక్క జిల్లాలకు వచ్చే అవకాశం ఉంటుంది.  


అందుకోసమే కర్నూలు జిల్లాలో హైకోర్టు ప్రతిపాదన తీసుకొచ్చినట్టు కేబినెట్ పేర్కొన్నది.  కేబినెట్ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాల తరువాత వీటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.  అసెంబ్లీలో మెజారిటీ ఉన్నది కాబట్టి పాస్ అవుతుంది.  అయితే, శాసన మండలిలో ఎలా అన్నది చూడాలి.  ఇకపోతే, కర్నూలులోని హైకోర్టు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అన్నది చూడాల్సిన అంశం.  


1953 లో రాజధానిగా కర్నూలు ఉండేది.  కానీ, 1956లో రాజధాని హైదరాబాద్ కు మారిన తరువాత కనీసం హైకోర్టును కర్నూలులో ఉంచాలనే డిమాండ్ ఉన్నది.  శ్రీభాగ్ ఒప్పందంలో ఇదే విషయం చెప్పారు.  కానీ, అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.  ఎట్టకేలకు ఇప్పటికి మోక్షం వచ్చింది.  హైదరాబాద్ నుంచి రాజధానిని అమరావతికి వచ్చిన తరువాత అక్కడే అన్ని ఏర్పాటు చేశారు.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాజధానిని కర్నూలకు హైకోర్టు ఇవ్వడంతో అక్కడి ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: