చంద్రబాబునాయుడు వ్యూహాలకు  జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లానింగ్ తో చెక్ పెట్టారు.  మూడు రాజధానుల ప్రతిపాదనలకు చట్టరూపం ఇచ్చే ఉద్దేశ్యంతో  మూడు రోజుల పాటు ప్రభుత్వం సోమవారం నుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  జగన్ ప్రతిపాదనపై గడచిన 34 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లోని కొన్ని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి చూస్తున్నదే. ఆందోళనలను ప్రధానంగా చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు పెంచి పోషిస్తున్నారు.

 

జగన్ ప్రతిపాదనను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతోనే  చంద్రబాబు రాజధాని గ్రామాలతో పాటు  రాష్ట్రంలో తిరుగుతూ నానా రచ్చ చేస్తున్నారు.

 

సరే చంద్రబాబు చేస్తున్న, చేయిస్తున్న రచ్చ ఎలాగున్నా  అసెంబ్లీ సమావేశాలనైతే ప్రభుత్వం ఖాయం చేసేసింది.  సోమవారం నుండి మొదలైన సమావేశాలను అడ్డుకోవటానికి చంద్రబాబు బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించారు. రాష్ట్రం నలుమూలల నుండి జనాలను అమరావతికి చేరుకోవాలని పిలుపినిచ్చారు. రాజధాని గ్రామాల్లోని జనాలను అసెంబ్లీ ముట్టడికి రెచ్చగొట్టారు. అరెస్టులైనా, లాఠీ చార్జీ జరిగినా భయపడద్దంటూ ధైర్యం చెప్పారు.

 

అంటే చంద్రబాబు పిలుపు ఎలాగుందంటే అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బ్రహ్మాండం బద్దలైపోతుందనే భయం జనాలో మొదలైపోయింది. అందుకనే ప్రభుత్వం కూడా చంద్రబాబు పిలుపును ఫెయిల్ చేయటానికి ప్రతి వ్యూహం పన్నింది. రాజధాని గ్రామాల్లో మొత్తం పోలీసు దళాలను దింపేసింది. నేతలను ముందు జాగ్రత్తగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయించింది. గ్రామాల్లోని జనాలను కూడా బయట తిరగాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డులను చూపాల్సిందే అంటూ ఆదేశించింది.

 

గ్రామాలకు సంబంధం లేని బయట వ్యక్తులను గుర్తించి మరీ బయటకు పంపేసింది. రాజధాని గ్రామాలతో ఏమాత్రం సంబంధం లేని  జనాలను ముందే తెప్పించి స్ధానికుల కుటుంబసభ్యులుగా చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అందుకనే గుర్తింపు కార్డుల విషయాన్ని పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. అల్లరి మూకలను తెప్పించి అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఘర్షణలు చేయించేందుకు కూడా రెడీ అయిందట. కానీ పోలీసులు ముందు జాగ్రత్త వల్ల సాధ్యం కాలేదు. మొత్తానికి ఇప్పటికైతే అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగానే జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: