ఆంధ్రప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు అసెంబ్లీ సమావేశం స్టార్టింగ్ లోనే నిరసనలు చేస్తూ గోలగోల చేస్తూ ఉంటున్న తరుణంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అసలు తెలుగు వారి చరిత్ర గురించి మరియు అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ అనే పదం ఏ విధంగా వచ్చిందన్న దాని గురించి చాలా విషయాలు తెలియని విషయాలు చరిత్రలో ఉన్న విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి మాట్లాడిన బుగ్గన ఆ కమిటీ లో ఉన్న విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేశారు.

 

పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అప్పట్లోనే శివరామకృష్ణ కమిటీ గుర్తించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతి ప్రాంతం మూడు పంటలు పండే ప్రాంతం అని...ఇటువంటి నేల భారతదేశంలో అరుదుగా ఉంటుందని వ్యవసాయానికి అనుకూలంగా ఉండే ప్రాంతం అమరావతి అని అంతేకాకుండా అమరావతి తో పాటు కృష్ణ మరియు గోదావరి జిల్లాలో వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి అంటూ శివరామకృష్ణ కమిటీ తేల్చిందని వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చకూడదని అప్పట్లోనే శివరామకృష్ణ కమిటీ ప్రభుత్వానికి తెలియజేసిందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన గుర్తు చేశారు. వరద వస్తే చంద్రబాబు గుర్తించిన అమరావతి ప్రాంతం 70శాతం మునిగి పోతున్నట్లు నివేదికలో ఉందని పైగా ఆర్థిక పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తక్కువ అప్పులు ఎక్కువగా ఉన్నామని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి జరగాలని ఉద్దేశంతోనే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

 

ఒక ఉద్దేశపూర్వకంగానే అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక రాజధానిగా గుర్తించిందని అమరావతి భూములను కొనుగోలు చేసిన విషయాలను అన్ని విషయాలను ఎవరు కొన్నారు ఎంత కొన్నారు అన్న విషయాలను బుగ్గన రాజేంద్రనాథ్ అన్ని లెక్కలు అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రాజధాని అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్ని లెక్కలతో సహా బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బయటపెట్టారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: