ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఇక ఈ విషయంపై చర్చను ఆరంభించిన బుగ్గన..ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు దారి తీసిన పరిస్థితులను సభకు వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా లక్ష కోట్లతో రాజధాని కడతామంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన రీతిలో కాకుండా.. వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జగన్ సర్కారు ముందుకెళ్తున్న తీరును ఆయన వివరించారు.

 

అయితే ఈ సమావేశాల ఆరంభంలోనే ఓ చమత్కారం చోటు చేసుకుంది. సభలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రవేశించిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని

స్పీకర్ ను పలకరించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ షాకయ్యారు. 'ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారు కానీ.. ఇలా బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలం' అని కౌంటర్ ఇచ్చారు.

 

ఆ తర్వాత రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ ప్రవేశపెట్టారు. అనంతరం వికేంద్రీకరణ బిల్లుపై చర్చను మంత్రి బుగ్గన ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్ వంటి భవనాలు అవసరం లేదు. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు. ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత అని అన్నారు. ఇది చారిత్రాత్మక బిల్లని వర్ణించారు.

 

ఆయన ఈ చర్చలోనే.. సర్కారు నిర్ణయాలను ప్రకటించారు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌ భవన్‌, సచివాలయం. కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లని బుగ్గన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: