జనసేన ఏకైక ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ బతిమలాడుకుంటున్నారు.  జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల ప్రతిపాదనపై అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ రాపాకను పవన్ కోరారు. ఎందుకు ప్రత్యేకించి కోరారంటూ ఇప్పటికే ఎంఎల్ఏ మూడు రాజధానుల ప్రతిపాదనకు జై కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.

 

మొదటి నుండి కూడా రాపాక పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ మాట్లాడుతుంటే అనుకూలంగా రాపాక ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.  స్కూళ్ళల్లో  ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టే విషయంలో కూడా పవన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. అయితే అసెంబ్లీలో జరిగిన చర్చలో రాపాక మద్దతు పలుకుతూ మాట్లాడారు.

 

ఇలా  ప్రతి విషయంలోను పవన్ కు ఎంఎల్ఏకి చుక్కెదురే అవుతోంది. ఒక దశలో పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడుతున్న కారణంగా  నోటీసులు ఇవ్వాలని కూడా పార్టీ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నోటీసులు జారీ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. ఏం జరిగిందో తెలీదు కానీ మళ్ళీ నోటీసుల గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడలేదు.

 

ఈ నేపధ్యంలోనే  జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రకటన  చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో టిడిపి ఎంత రచ్చ చేస్తోందో అందరూ చూస్తున్నదే.  చంద్రబాబుకు తోడుగా పవన్ కూడా నానా యాగీ చేస్తున్నారు. గడచిన 34 రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో, పెయిడ్ ఉద్యమాలు చేయిస్తున్నట్లు వైసిపి తీవ్రమైన ఆరోపణలే చేస్తోంది. ఇంత ఉద్రిక్త పరిస్ధితుల మధ్య మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.

 

బిల్లుల విషయంలో అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుందని అందరు అనుకుంటున్నారు. అందుకనే ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ తమ ఎంఎల్ఏను పవన్ బతిమలాడుకుంటున్నారు. ఎందుకు బతిమలాడుకుంటున్నారంటే జగన్ ప్రతిపాదనకే తాను ఓటు వేయబోతున్నట్లు ఇప్పటికే రాపాక ప్రకటించేశారు కాబట్టే. వ్యవహరం ఓటింగ్ దాకా వస్తే రాపాక ఏం చేస్తారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: