జీవితంలో అప్పుడప్పుడు చేసే కొన్ని కొన్ని పనుల వల్ల  ప్రాణాలు పోతాయన్న విషయం ప్రతి వారికి తెలిసిందే. ఎప్పుడు అత్యుత్సాహం, ఆవేశం, నిర్లక్ష్యం ఈ మూడు మనిషికి ప్రమాదాలను తెచ్చిపెట్టే ఘటనలుగా చెప్పవచ్చు. ఇక విధి నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలంటారు పెద్దలు. వారు ఇలాచెప్పడంలో ఎంతో లోతైన అర్ధం ఉండి ఉంటుందని చాలా సార్లు కూడా నిరూపించబడింది. అందుకే ఆస్తులు పోయినా సంపాధించుకోవచ్చు, కాని ప్రాణాలు పోతే తిరిగి తేవడం చాలా కష్టం. మనం ఏదో చేద్దామని ఆవేశంలో ఎదురెళ్లామనుకో, మనకెదురుగా ఉన్నవాడు మూర్ఖుడైతే, నీచుడైతే వాడు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల  ఈ వీడియోలో జరిగినట్లుగా జరుగుతుంది.

 

 

ఇంతకు ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే ఒక టోల్ గేట్ ఉద్యోగికి, ట్రక్కు డ్రైవర్‌కు మధ్య ఏ విషయంలో వాదులాట జరిగిందో తెలియదు గాని, అతను కూర్చున్న సీటులో నుండి బయటకు వచ్చి ట్రక్కు డోర్ తీద్దామని లాగగా అది తెరచుకోలేదు. ఇదే సమయంలో ట్రక్కు ముందుకు వెళ్లుతున్న విషయం తెలిసి కూడా, ఆ టోల్ గేట్ వ్యక్తి ట్రక్కు ముందు నుండి డ్రైవర్ వైపు వెళ్లి అతని డోర్ తీసి ఏం చేద్దామనుకున్నాడో ఏమో, కానీ ఇంతలో ఆ డ్రైవర్ ట్రక్కు వేగాన్ని పెంచి ముందుకు పోనిచ్చాడు.

 

 

అంతలో ట్రక్కు ముందుగా ఉన్న ఆ వ్యక్తి ట్రక్కు పైకి ఎక్కడానికి ట్రై చేసి, దాని ముందు టైర్ క్రింద పడిపోయాడు. ఈ సంఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ దారుణ ఘటన జరిగింది నోయిడాలోని టోల్ గేటు వద్ద.. ఇక ఈ ఘోరం మొత్తం టోల్ గేటులోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. చనిపోయిన వ్యక్తి టోల్ గేట్ ఉద్యోగని తెలిసింది. ఈ ఘటన తర్వాత ఆ ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: