ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి అసెంబ్లీలో చంద్రబాబునాయుడును వాయించేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్,  భూ కేటాయింపులు తదితరాలపై సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి పోయిన సమావేశాల్లోనే వివరాలు చెప్పిన బుగ్గన ప్రస్తుతం మరింత డీటైల్డ్ గా వివరించారు.  టిడిపి నేతలు  ఏ ఏ గ్రామాల్లో  ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూములు కొన్నారనే విషయాన్ని వివరంగా చెప్పారు.

 

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే  భూ కేటాయింపుల్లో కూడా చంద్రబాబు పాల్పడిన అవకతవకలకు చక్కగా వివరించారు. కేంద్ర  ప్రభుత్వ సంస్ధలకు, ప్రభుత్వ రంగం సంస్ధలకు 3 లేకపోతే 4 ఎకారలను మాత్రమే కేటాయించిన చంద్రబాబు ప్రైవేటు సంస్ధలకు మాత్రం వందల ఎకరాలను కేటాయించిన విషయాలను ఆధారాలతో సహా చెప్పారు. అలాగే కేంద్రప్రభత్వ సంస్ధలు, ప్రభుత్వ రంగం సంస్ధలకు ఎకరా భూమిని రూ. 3 లేదా రూ. 4 కోట్లకు కేటాయించిన  చంద్రబాబు ప్రైవేటు సంస్ధలకు మాత్రం ఎకరా భూమిని కేవలం రూ. 50 లక్షల చొప్పునే  కేటాయించిన విషయాన్ని బయటపెట్టారు.  

 

ప్రభుత్వ సంస్ధలకు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎక్కువ భూములు కేటాయించి ధర కూడా తక్కువకే ఇస్తారన్న విషయాన్ని బుగ్గన గుర్తుచేశారు.  కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వానికి ఎకరా  భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చి ప్రైవేటు సంస్ధలకు మాత్రం శాస్వతంగా తక్కువ ధరలకే ఎలా అమ్ముతారంటూ  నిలదీశారు.

 

ప్రభుత్వ సంస్ధలు, ప్రభుత్వ రంగ సంస్ధలకు భూ కేటాయింపులతో పాటు ధరలు, ప్రైవేటు సంస్ధలకు కేటాయించిన భూములు వాటి ధరలను చూస్తే ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో అందరికీ అర్ధమైపోతోందని స్పష్టంగా చెప్పారు. దాదాపు రెండు గంటలసేపు మాట్లాడిన బుగ్గన రాజధాని నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు  ఏ స్ధాయిలో భూ దోపిడికి పాల్పడ్డారో పూర్తి వివరాలతో సహా చెప్పేశారు. బుగ్గన వివరాలు చదువుతున్నపుడు సభలో చంద్రబాబు మొహం మాడిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: