ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించటం వలన అమరావతికి సమీపంలో ఉన్న ప్రాంతాలకు అంతో ఇంతో మేలు జరిగినా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. 
 
సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేయటం ఆ తరువాత జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా నివేదికలు ఇవ్వడం, కేబినేట్ మూడు రాజధానుల నిర్మాణానికి ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయం వలన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏరియాలు అభివృద్ధి చెందనున్నాయి. 
 
మూడు రాజధానుల నిర్ణయం వలన మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందటంతో పాటు 13 జిల్లాల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా రాజధానిని కేవలం అమరావతికి మాత్రమే కేంద్రీకృతం చేసి ఉంటే అమరావతిలో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. జగన్ తీసుకున్న నిర్ణయం వలన శాసన రాజధానిగా ఉన్న అమరావతి తో పాటు పరిపాలన రాజధానిగా ఉన్న వైజాగ్ అటు హైకోర్టు ఉండే కర్నూలు కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందనున్నాయి. 
 
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వలన కేవలం ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందన్న విమర్శలు అటు ప్రజల నుండి కానీ ఇటు రాజకీయనాయకుల నుండి కానీ వ్యక్తం కావు. ప్రభుత్వం కూడా మూడు రాజధానులను సమానంగా అభివృద్ధి చేసుకుంటూ ముందడుగులు వేయవచ్చు. మూడు రాజధానుల వలన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పరిపాలన వికేంద్రీకరణ జరగనుంది. నిధులన్నీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కేటాయించడం వలన మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: