ఆంధ్రప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి గతంలో చంద్రబాబు హయాంలో రాజధాని విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి అమరావతి ప్రాంతాలలో మరియు అదే విధంగా రాజధాని పరిసర ప్రాంతాలలో చంద్రబాబునాయుడు మనుషులు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఏ విధంగా ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించి భూములను వేల ఎకరాలలో కొనుగోలు చేశారు అన్న దాని విషయంలో లెక్కలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

 

ఈ సందర్భంగా అమరావతిలో చంద్రబాబు బ్యాచ్ అనగా పచ్చ బ్యాచ్ మొత్తం 40 వేల కోట్ల స్కాం విలువ గల భూములను కొన్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. వెల‌గ‌పూడి, మందాడ, ఐన‌వోలు, హ‌రిశ్చంద్రాపురం, నంబూరులో భారీ ఎత్తున భూముల కొనుగోళ్లు మొత్తం 4 వేల‌కు పైగా భూముల కొనుగోళ్లు వాళ్లు చెప్పిన‌ట్టు ఎక‌రం రు.10 కోట్లు వేసుకున్నా మొత్తం 40 వేల కోట్లు దందా తాడికొండ‌, తుళ్లూరు, మంగ‌ళ‌గిరి, అమ‌రావ‌తి, పెద‌కూర‌పాడు, పెద‌కాకాని మండ‌లాల్లో చంద్ర‌బాబు హెరిటేజ్ పేరిట‌, పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, పయ్యావుల కేశ‌వ్‌, జీవి ఆంజ‌నేయులు, ప‌రిటాల సునీత కుటుంబ స‌భ్యులు పేరిట భారీ ఆస్తుల కొనుగోళ్లు చేసినట్లు అన్ని విషయాలు బయటపెట్టారు.

 

మొత్తం మీద అమరావతి రాజధాని భూముల విషయంలో చంద్రబాబు మనుషులు చంద్రబాబు అధికార దుర్వినియోగం చేయడం వల్ల ఇన్సైడర్ ట్రేడింగ్ జరగటం వల్ల కొన్ని వేల ఎకరాలు మారుమూల గ్రామాల ప్రాంతాల్లో కొని ఆ తరువాత చంద్రబాబు రాజధాని అమరావతిని ప్రకటించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. ఇంకా అనేక విషయాల గురించి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ కేవలం చంద్రబాబు నాయుడు తన వర్గ ప్రజల కోసం మరియు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం అమరావతిని రాజధానిగా గుర్తించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవడం జరిగిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంతటా అభివృద్ధి జరగాలని అభివృద్ధిలో అన్ని ప్రాంతాలు భాగస్వామ్యం కావాలని వికేంద్రీకరణ జరగాలని ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: