అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని భారీగా టిడిపి నేతలకు సంబంధించిన బినామీలు భూములు కొనుగోలు చేశారు అంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ విచారణ కూడా చేపడతామని గతంలో జగన్మోహన్ రెడ్డి  సర్కార్ స్పష్టం చేసింది. అయితే నేడు అత్యవసర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు  తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు అందరూ తమ బినామీల పేర్లతో అక్రమంగా భూములు కొనుగోలు చేశారు అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో  తెలిపారు.

 


 అదే సమయంలో పలువురి పేర్లను కూడా చదివి వినిపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. దీంతో టిడిపి నేతలు తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అసత్యాలను చెబుతున్నారు అంటూ టీడీపీ నేతలు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే నిరూపించాలి అంటూ మంత్రి కి సవాల్ విసిరారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా టిడిపి నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాం కొంత సేపు వాగ్వాదం జరిగింది. టిడిపి ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని  సీతారం ఈ సందర్భంగా సీరియస్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఇది నిజమైన ఆరోపణలు అయినా వాస్తవాలు మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 

 


 ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపించి అసలు దోషులెవరో ప్రజలకు తెలపాలి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం మాటలకు స్పందించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... శాసనసభ స్పీకర్ ది అత్యున్నతమైన స్థానమని... ఆ స్థానం నుంచి వచ్చిన ఆదేశాల ఏమైనా  ఖచ్చితంగా అమలు చేస్తామంటూ తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించి.. అసలు దోషులెవరో  ప్రజల ముందు నిలబెడతాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: