రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు అభివృద్ధి నోచుకోలేక వెనుకబడి పోయానని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతైనా అవసరమని దీని కోసం రాష్ట్రంలో మొదటి రాజధాని ఏర్పడే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అమరావతి అభివృద్ధి చేయడం చేతకాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజదానుల  నిర్ణయాన్ని తెరమీదికి తెచ్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. ఇక ఏకంగా టిడిపి అధినేత చంద్రబాబు  రాష్ట్రంలో అమరావతి రైతులు చేపడుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ జోలె  పట్టి మరి విరాళాలు సేకరిస్తున్నారు. 

 

 ఇక తాజాగా టీడీపీ అధినేత ప్రతిపక్షనేత మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ... అక్కడి నుంచి అమరావతి కి ఎందుకు వచ్చారు  అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా. నగరాన్ని బెంగుళూర్  తరహాలో అభివృద్ధి చేస్తామని  తెలిపిన మీరు... కనీసం అమరావతిలో ఒక్క  శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదు అంటూ విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలకు 2 బాత్రూంలా   అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే రోజా. అసలు  చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ప్రతిపక్షనేతా  లేఖ... 29 గ్రామాలకు మాత్రమే ప్రతిపక్ష నేతనా  అంటూ ప్రశ్నించారు. 

 


 అమరావతిలో చంద్రబాబు కూకట్ పల్లి  నుంచి మహిళలను తీసుకువచ్చి నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని చెప్పారు అంటూ నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. కానీ మూడు రాజధానులు నిర్మించవద్దని.. అమరావతి నుంచి రాజధాని తరలింపు పై వ్యతిరేకంగా  ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం జోలిపట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో జోలిపట్టి అడ్డుకుంటున్న చంద్రబాబు... ప్రజా సమస్యలపై ఏనాడైనా జోలిపట్టి అడగడం చూశారా అంటూ ప్రశ్నించారు నగరి ఎమ్మెల్యే రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: